HomeMovie News Teluguయంగ్‌ టైగర్‌ దూసుకొచ్చేస్తోందిలా.!

యంగ్‌ టైగర్‌ దూసుకొచ్చేస్తోందిలా.!

ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ‘ టీజర్‌ ఎట్టకేలకు రానే వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు. అభిమానులు ఆశించినట్లుగా టీజర్‌ చాలా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. 

‘మండువేసవి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా..’ అంటూ జగపతిబాబు పవర్‌ఫుల్‌గా చెబుతున్న డైలాగ్‌ రోమాలు నిక్కబొడిచేలా ఉంది. ‘కంట పడ్డావా కనికరిస్తానేమో. వెంట పడ్డానా.. నరికేస్తావోబా..’ అంటూ ఎన్టీఆర్‌ కుర్చీలో కూర్చొని చెబుతున్న డైలాగ్‌ ఎన్టీఆర్‌ అభిమానుల్ని ఊపేస్తోంది. సిక్స్‌ ప్యాక్‌తో కత్తి పట్టుకుని ప్రత్యర్దుల వెంట పరుగు తీస్తుంటే, నిజంగానే గాండ్రిస్తూ పెద్ద పుల్లి వెంటపడ్డట్లే కనిపిస్తోంది. 

రాయలసీమ ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది. టీజర్‌లో అదే ఫ్లేవర్‌ని ప్రత్యక్షంగా చూపించారు. జగపతిబాబు, ఎన్టీఆర్‌ రాయలసీమ యాసలో మాట్లాడుతూ చెబుతున్న డైలాగ్స్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

ముద్దుగుమ్మ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. మరో భామ ఈషా రెబ్బా ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్‌ రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాల చిత్రీకరణతో చిత్ర యూనిట్‌ బిజీగా ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular