HomeMovie News Teluguవీరనారిగా కంగనా యుద్ధ వీరంగం.!

వీరనారిగా కంగనా యుద్ధ వీరంగం.!

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘మణికర్ణిక’ చిత్ర ఫస్ట్‌లుక్‌ని విడుదలైంది. అద్దిరిపోయింది అన్న మాట చిన్నదే అవుతుంది. మైండ్‌ బ్లోయింగ్‌గా ఉందీ ఫస్ట్‌లుక్‌. చంకలో బిడ్డనెత్తుకుని, గుర్రంపై కత్తి పట్టి, యుద్ధ రంగాన భీకరమైన పోరాటం చేస్తున్న వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ పాత్రలో కంగనా రనౌత్‌ జీవం పోసేసినట్లుంది ఈ పోస్టర్‌ చూస్తూంటే. 

దేశం కోసం, దేశ ప్రజల కోసం బ్రిటీష్‌ వారితో యుద్ధం చేసిన ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవిత గాధ ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవిత గాథని ఇంతవరకూ పుస్తకాల్లో మాత్రమే చదివి తెలుసుకున్నాం. అలాంటిది వెండితెరపై దృశ్య కావ్యంలా ఆవిష్కరిస్తున్నారు డైరెక్టర్‌ క్రిష్‌. చరిత్రను తెలుసుకోవాలనే ఆశక్తి ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే చదివి తెలుసుకునే దానికన్నా, విజువల్‌గా తెలుసుకుంటే ఆ ప్రభావం మరింత బావుంటుంది. ఆ ప్రయత్నమే చేస్తున్నారు ‘మణికర్ణిక’ సినిమాతో డైరెక్టర్‌ క్రిష్‌. 

ఝాన్సీ లక్ష్మీభాయ్‌ అసలు పేరు మణికర్ణిక. అదే టైటిల్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ప్రముఖ నటుడు సోనూ సూద్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. హిందీలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లోనూ విడుదల చేయనున్నారు. 

‘క్వీన్‌’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కంగనాకి ‘మణి కర్ణిక – ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ మరింత మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆశిద్దాం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular