HomeMovie News Teluguపూరీ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌?

పూరీ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌?

పూరీ జగన్నాధ్‌ – ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ‘టెంపర్‌’ సినిమా వచ్చింది. అప్పటి వరకూ వరస ఫ్లాపులతో సతమతమవుతున్న డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌కి బెస్ట్‌ రీఫ్రెష్‌మెంట్‌ ఈ సినిమాతో దక్కింది. ఎన్టీఆర్‌ నటనకు, పూరీ టేకింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి ఈ సినిమాతో. మాస్‌ మెచ్చిన చిత్రంగా హిట్‌ సినిమాల లిస్టులోకి చేరింది మూడేళ్ల క్రితం వచ్చిన ‘టెంపర్‌’ మూవీ. 

ఇదిలా ఉండగా, ఈ కాంబినేషన్‌లో మళ్లీ ఇంకో సినిమా రాబోతోందంటూ హాట్‌ హాట్‌గా గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు. పూరీ జగన్నాధ్‌ కొడుకు ఆకాష్‌తో ‘మెహబూబా’ అనే కొత్త రకం కాన్సెప్ట్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో నేహాశెట్టి అనే కొత్త భామని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు పూరీ. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ టీజర్‌ విడుదలై మంచి రెస్పాన్స్‌ అందుకుంటోంది. అతి త్వరలోనే ఈ సినిమా నిర్మాణం పూర్తి కానుంది. 

ఈ సినిమా పూర్తి కాగానే, పూరీ జగన్నాధ్‌, ఎన్టీఆర్‌ కోసం స్క్రిప్టు ప్రిపేర్‌ చేసే పనిలో పడనున్నాడనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. ఎన్టీఆర్‌తో సినిమా అంటే తనకెంతో కంఫర్ట్‌బుల్‌గా ఉంటుందనీ, అలా ‘టెంపర్‌’ తన కెరీర్‌లోనే ది బెస్ట్‌ మూవీ అనీ పూరీ జగన్నాధ్‌ చెబుతున్నాడు. ఒకవేళ తాజా గాసిప్‌ నిజమైతే, టెంపర్‌ కాంబో మరో సారి ఇటు పూరీ అభిమానుల్నీ, అటు ఎన్టీఆర్‌ అభిమానుల్ని అలరిస్తుండనడం నిస్సందేహం. 

మరో పక్క ‘టెంపర్‌’ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. రోహిత్‌ శెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘సింబా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular