HomeMovie News Teluguకన్నడిగుల మనసు దోచేసిన విజయ్‌

కన్నడిగుల మనసు దోచేసిన విజయ్‌

హీరోగా తొలి సినిమా ‘పెళ్లి చూపులు’తోనే రాత్రికి రాత్రి స్టార్‌ అయిపోయాడు విజయ్‌ దేవరకొండ. తెలంగాణా యాసతో మాట్లాడుతూ, తెలంగాణా ప్రజల్నే కాకుండా, తెలుగు ప్రజల అభిమానం కూడా పొందాడు. తాజాగా ప్రముఖ కన్నడ నటుడు గణేశ్‌ నటించిన ‘ఛమక్‌’ చిత్రం ఆడియో ఫంక్షన్‌కి విజయ్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఆ ఫంక్షన్‌లో కన్నడ ప్రజల మనసు దోచుకునేలా మాట్లాడాడు విజయ్‌ దేవరకొండ. 

తొలుత నటుడు గణేశన్‌ గురించి ఆయన స్టార్‌డమ్‌ గురించి కొనియాడారు. తర్వాత కన్నడ రాష్ట్రం నుండి వచ్చి జాతీయ స్థాయిలో ఎదిగిన పలువురు ప్రముఖులనుద్ధేశించి ప్రసంగించాడు. కర్ణాటక అంటే మొదట క్రికెటర్స్‌ రాహుల్‌ ద్రావిడ్‌, జవగల్‌ శ్రీనాధ్‌, వేంకటేష్‌ ప్రసాద్‌, అనిల్‌ కుంబ్లే గుర్తొస్తారన్నాడు విజయ్‌ దేవరకొండ. అలాగే సినీ ప్రముఖులుగా కీర్తించబడుతున్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, అందాల భామ ఐశ్వర్యారాయ్‌ తదితరులు కూడా కర్ణాటక నుండి వచ్చిన వారే అందుకే నాకు కర్ణాటక అంటే ఎంతో ఇష్టం అన్నాడు విజయ్‌ దేవర కొండ. 

ఈ రకంగా తన మాటలతో కన్నడిగుల మనసు దోచేశాడు మనోడు. తెలుగు సినీ పరిశ్రమ నుండి, ఎవ్వరూ ఇంతవరకూ కన్నడ పరిశ్రమ గురించి ఇంతగా మాట్లాడిన వారు లేరు. సో ఈ రకంగా కూడా స్టార్‌ అయిపోయాడు విజయ్‌ దేవరకొండ. అబ్బో ఈ తెలంగాణా కుర్రోడు మామూలోడు కాదండోయ్‌. బహు తెలివైనోడు. అంతేకాదండోయ్‌ మన అరుంధతి అనుష్క కూడా కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చిన ముద్దుగుమ్మే. ఆ మాట కూడా ఆయన గుర్తు చేశారు. 

అలాగే తాజాగా తెలుగు తెరకు పరిచయమవుతోన్న రష్మికా మండన్నా కూడా కన్నడ భామే. నాగశౌర్య హీరోగా వస్తోన్న ‘ఛలో’ సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతోంది. విజయ్‌ దేవరకొండతో ఈ ముద్దుగుమ్మ ‘ఏ మంత్రం వేశావె’ చిత్రంలో నటిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular