HomeMovie News Teluguఈ 'తొలిప్రేమ' ఆ 'తొలిప్రేమ'ని తలపిస్తుందా?

ఈ ‘తొలిప్రేమ’ ఆ ‘తొలిప్రేమ’ని తలపిస్తుందా?

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమా అప్పట్లో పెద్ద హిట్‌. యూత్‌కి ఐకాన్‌గా మారిపోయింది ఈ సినిమా. ఇప్పుడు అదే టైటిల్‌తో మరో ‘తొలిప్రేమ’ వచ్చేస్తోంది. మెగా కాంపౌండ్‌ హీరోనే హీరోగా. లవర్‌ బోయ్‌ వరుణ్‌ తేజ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రానికి మొదట్నుంచీ ‘తొలిప్రేమ’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. అదే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్‌ చేశారు. టైటిల్‌ రిలీజ్‌ చేస్తూ ఫస్ట్‌లుక్‌ ఫోటోలు కూడా వదిలారు.

అచ్చం బాబాయిలానే ప్రేమికుల హృదయాల్ని సుతి మెత్తగా కోసేస్తున్నాడు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ఈ లుక్స్‌లో. రెండు లుక్స్‌ రిలీజ్‌ చేశారు. రెండు లుక్స్‌లోనూ ఒకదానితో ఒకటి తనతో తానే పోటీ పడుతున్నాడు వరుణ్‌ తేజ్‌. లవర్స్‌ని ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటున్నాడు. డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు ఈ రెండు లుక్స్‌లోనూ. పవన్‌ కళ్యాణ్‌ ‘తొలిప్రేమ’ విజయాన్ని అప్పట్లో సెన్సేషన్‌గా చెప్పుకున్నాం. ఈ తరం ప్రేమికులకు వరుణ్‌ ‘తొలిప్రేమ’ గురించి కథలు కథలుగా చెప్పుకునేలా ఈ సినిమా విజయం సాధిస్తుందని మెగా ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

‘ఫిదా’తో ప్రేమికుల్ని ఆకట్టుకోవడంతో పాటు వసూళ్లలో తన స్టామినా ఏంటో చూపించాడు వరుణ్‌ తేజ్‌. అలాగే ఈ సినిమాతో మరో సారి లవ్‌ టచ్‌ ఇవ్వబోతున్నాడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ అయిన ఈ సినిమా కోసం అంతా ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ సినిమాని లవ్‌ మంత్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. ఫిబ్రవరి 9న ‘లవర్స్‌డే’ సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే టీజర్‌ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular