HomeMovie News Teluguనితిన్‌ సరసన పూజా హెగ్దే!

నితిన్‌ సరసన పూజా హెగ్దే!

‘శతమానం భవతి’ సినిమాలో సతీష్‌ వేగేశ్న ఈ ఏడాది మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ యంగ్‌ డైరెక్టర్‌ యంగ్‌ హీరో నితిన్‌తో సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘శతమానంభవతి’ సినిమాని రూపొందించిన దిల్‌ రాజు ఈ చిత్రాన్ని తన బ్యానర్‌లో రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో నితిన్‌ సరసన హీరోయిన్‌గా ముద్దుగుమ్మ పూజా హెగ్దేని ఎంపిక చేశారనీ తాజా సమాచారమ్‌.

మొదట్లో ఈ సినిమాకి ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవిని అనుకున్నారు. అయితే సెలెక్ట్‌డ్‌గా సినిమాలు చేసే సాయి పల్లవి ఈ సినిమాకి నో చెప్పడంతో ఆ ప్లేస్‌లోకి ‘డీజె’ బ్యూటీ పూజా హెగ్దే వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ‘డీజె’తో హిట్‌ కొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ‘సాక్ష్యం’ సినిమాలో నటిస్తోంది. కాగా నితిన్‌ ఈ మధ్య ‘లై’ సినిమాతో విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్‌ చేశాడు. అయితే సినిమా విడుదలయ్యాక ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. దాంతో ‘అ,ఆ..’తో వచ్చిన సూపర్‌ సక్సెస్‌ని ‘లై’తో కంటిన్యూ చేయలేకపోవడంతో నితిన్‌ కొంచెం డీలా పడ్డాడు. కానీ ప్రస్తుతం నితిన్‌ చేతిలో భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. 

అందులో ఒకటి పవన్‌ కళ్యాణ్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమా. త్రివిక్రమ్‌ ఈ సినిమాకి కథనందించగా, కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఆల్రెడీ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో ‘లై’ బ్యూటీ మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవి కాక మరో ప్రాజెక్ట్‌ కూడా లైన్‌లో ఉందట నితిన్‌కి. ఓ మల్టీ స్టారర్‌లో కూడా నితిన్‌ నటిస్తున్నట్లు సమాచారమ్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular