HomeMovie News Teluguఅదీ పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అంటే!

అదీ పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అంటే!

అభిమాన హీరోల పేరుతో టీ షర్ట్సు, కీ చైన్స్‌ తదితర బ్రాండ్లు మార్కెట్‌లోకి రావడం సహజమే. తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు ఇలాంటి న్యూ బ్రాండ్స్‌ క్రేజ్‌ ఎక్కువగా వుండడం చూస్తుంటాం. అయితే తాజాగా ఓ మొబైల్‌ సంస్థ పవన్‌ పేరిట ‘పీకే 25’ పేరుతో ఓ కొత్త మొబైల్‌ని లాంఛ్‌ చేయాలనే యోచనలో ఉందనీ సమాచారమ్‌. 

గతంలో ‘జానీ’, ‘గుడుంబా శంకర్‌’, ‘బాలు’, గోపాల గోపాల’ తదితర చిత్రాల టైంలో ప్యాంట్లు, టీ షర్ట్స్‌, కీ చైన్స్‌ తదితర వస్తువులు పవన్‌ బ్రాండ్‌తో మార్కెట్లో పిచ్చ క్రేజ్‌ సంపాదించాయి. తాజాగా ఈ మొబైల్‌ ట్రెండ్‌తో సరికొత్త ట్రెండ్‌కి పవన్‌ శ్రీకారం చుట్టేలా ఉన్నారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ విషయంలో ఇలాంటి బ్రాండ్‌లు ఎక్కువగా వింటుంటాం. తర్వాత ఆ క్రేజ్‌ పవన్‌ కళ్యాణ్‌దే అని చెప్పొచ్చు. యూత్‌కి ఓ న్యూ ట్రెండ్‌ పవన్‌ కళ్యాణ్‌. స్టైల్‌లోనూ, ఇతరత్రా కొన్ని సైన్స్‌లో పవన్‌ అంటే యూత్‌కి పిచ్చ క్రేజ్‌. అందుకే ఆయన ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యారు. చేసింది 25 సినిమాలే అయినా కానీ కొన్ని వందల సినిమాలు చేసినంత అభిమానాన్ని సంపాదించుకున్నారు. 

25వ సినిమాగా ‘అజ్ఞాతవాసి’ తెరకెక్కుతోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌ అంటేనే యమా క్రేజ్‌. స్టార్టింగ్‌ నుండీ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. అనూ ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ ఈ సినిమాలో పవన్‌తో జత కడుతున్నారు. ఈ సినిమాతో పవన్‌లో చాలా మార్పులు కూడా వచ్చాయి. కొత్తగా సినిమాల కోసం ప్రత్యేకంగా ట్విట్టర్‌ అకౌంట్‌ని తెరిచి, అందులో సూపర్‌ యాక్టివ్‌గా ఉంటున్నారు. జనవరి 10న ‘అజ్ఞాతవాసి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular