HomeMovie News Telugu'జై లవ కుశ' హీట్‌ పెంచేస్తోంది

‘జై లవ కుశ’ హీట్‌ పెంచేస్తోంది

వచ్చేస్తోంది ‘జై లవ కుశ’ టీజర్‌. ఇంతకీ ఇందులో ఏముంది? ఈ టెన్షన్‌ నందమూరి అభిమానుల్లో పెరిగిపోతోందంటే దానికి కారణం, ముందే ఈ టీజర్‌ లీక్‌ అయిపోవడం. సకాలంలో లీకేజ్‌ని అడ్డుకునేందుకు నిర్మాత కళ్యాణ్‌రామ్‌ ప్రయత్నించినప్పటికీ, కొంత డ్యామేజ్‌ అయితే జరిగిపోయింది. దాంతో టీజర్‌ని మార్చి మళ్ళీ కొత్తగా టీజర్‌ని డిజైన్‌ చేసి విడుదల చేయబోతున్నారని సమాచారమ్‌. ఒక్క టీజర్‌ కాదు, మూడు టీజర్స్‌ రాబోతున్నాయట. ఎందుకంటే ‘జై లవ కుశ’ సినిమాలో ఎన్టీయార్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌కి కెరీర్‌లో ఇదే తొలి అనుభవం త్రిపాత్రాభినయం పరంగా చూస్తే. మూడు పాత్రల్లో ఒకటి నెగెటివ్‌ రోల్‌. అదే సినిమాకి అత్యంత కీలకమని నిర్మాత కళ్యాణ్‌రామ్‌ కూడా చెప్పాడు. దురదృష్టవశాత్తూ టీజర్‌ లీకేజీతో ఆ పార్ట్‌ సస్పెన్స్‌ వీడిపోయింది కొంతవరకు. నష్టం జరిగిందని నిర్మాత కళ్యాణ్‌రామ్‌ అంగీకరించాడంటే ఎంతగా ఆ లీకేజ్‌తో ఆయన డిజప్పాయింట్‌ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అక్కడున్నది ఎన్టీయార్‌ సినిమా. కాబట్టి అంచనాలు పెరగడమే తప్ప, తరగడం ఉండదు.

కెరీర్‌ బెస్ట్‌ రోల్స్‌ ఇప్పటికే ఎన్టీయార్‌ ఎన్నో చేసేశాడు. తొలి సినిమా ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’తోనే వయసుకు మించిన బరువైన పాత్రలో మెప్పించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఎన్టీయార్‌. ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’ దేనికదే. వాటన్నిటినీ మించి ‘జై లవ కుశ’ ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ‘జై లవకుశ’ టీజర్‌ వచ్చేస్తోంది కాబట్టి, అదెలా ఉంటుందో ఇంకొన్ని గంటలపాటు సస్పెన్స్‌ని ఎంజాయ్‌ చేసెద్దాం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular