HomeMovie News Teluguబన్నీ మరోసారి హాట్‌ టాపిక్‌ ఆయ్యాడు

బన్నీ మరోసారి హాట్‌ టాపిక్‌ ఆయ్యాడు

ఈ మధ్య బన్నీ ఏదో ఒక విషయమై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో హాట్‌ టాపిక్‌ అవుతున్నాడు. అసలు ఇప్పటికే బన్నీకి సోషల్‌ మీడియాలో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ నుండి నెగిటివ్‌ కామెంట్లు తప్పడం లేదు. ఇందుకు కారణం పవన్‌ కళ్యాణ్‌ విషయంలో బన్నీ నోరు జారడమే. అప్పట్నుంచీ బన్నీని సోషల్‌ మీడియా వదిలి పెట్టడం లేదు. అలాంటిది మరో సారి బన్నీ ఇప్పుడు అలాంటి వారికి టార్గెట్‌ అయ్యాడు. అదేంటంటే ప్రస్తుతం బన్నీ ‘డీజె’ సినిమా పబ్లిసిటీ విషయమై అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది.

సినిమా రివ్యూలు రాసే వారిపై బన్నీ కొంచెం ఫైర్‌ అయ్యాడు. రివ్యూ రాసే వ్యక్తి చాలా ఇంటెలెక్చువల్‌ అయ్యి ఉండాలంటున్నాడు బన్నీ. రివ్యూ రాసే సదరు వ్యక్తికి ఒక వ్యూ ఉంటుంది. అలా అని అదే వ్యూని అందరికీ కనెక్ట్‌ చేయడం చాలా తప్పు అంటున్నాడు బన్నీ. అంతేకాదండోయ్‌ బన్నీ రివ్యూల విషయమై కొంచెం గట్టిగానే స్పందించాడు. కమర్షియల్‌ మూవీ అంటే కేవలం ఏ ఒక్క జోనర్‌కో సంబంధించింది కాదు, లవ్‌, ఎమోషన్స్‌, ట్విస్ట్స్‌, యాక్షన్‌ ఇలా అన్ని రకాల జోనర్స్‌ని ఒకే సినిమాలో చెప్పగలిగే సత్తా కమర్షియల్‌ సినిమాలో ఉంటుంది.

ఆ సత్తా కేవలం మన సౌత్‌ సినిమాలకే సొంతం అంటున్నాడు బన్నీ. అలాగే ఆ సత్తా ఉన్న మన చిత్ర సీమని మనకి మనమే చిన్న బుచ్చుకోవడం చాలా బాధాకరం అంటున్నాడు. అందుకే రివ్యూ రాసేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సౌత్‌ సినిమాని బతికించండి అంటూ రివ్యూయర్స్‌కి మెత్తగా అయినా కానీ కొంచెం గట్టిగానే చురకలు అంటించాడు అల్లు అర్జున్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular