HomeMovie News Teluguమెగాస్టార్‌ వాట్‌ నెక్స్‌ట్‌

మెగాస్టార్‌ వాట్‌ నెక్స్‌ట్‌

చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ లేటెస్ట్‌ సీజన్‌ని ముగించారు. పూర్తిగా ఇకపై తన తదుపరి సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’పై ఫోకస్‌ పెట్టనున్నారు. ఈలోగా కొద్ది రోజులు రెస్ట్‌ తీసుకోవడానికి మెగాస్టార్‌ విదేశాలకు వెళతారని సమాచారమ్‌. ఫిట్‌నెస్‌ మీద దృష్టిపెట్టడంతోపాటు, కొత్త గెటప్‌కోసం ఫిజిక్‌ని ఛేంజ్‌ చేసుకోనున్నారని తెలియవస్తోంది. మీలో ఎవరు కోటీశ్వరుడు షోని చిరంజీవి అద్బుతంగా నిర్వహించారు. అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది ఈ సీజన్‌లో ఈ గేమ్‌ షోకి.

సెలబ్రిటీలతో అయితే చెలరేగిపోయారు చిరు. ఇక పిల్లలతో అయితే చిన్న పిల్లాడిగా మారిపోయారు. మొత్తం ఈ షోలో, చిన్న పిల్లలతో చిరంజీవి వ్యవహరించిన తీరు అత్యద్భుతం అని చెప్పవచ్చు. అయితే ఈ సీజన్‌ ప్రస్తుతం ముగింపుకు చేరిపోయింది. వేసవి సెలవుల్లో పిల్లలకు పెద్దలకు కూడా ఎంతో ఖుషీనిచ్చింది ఈ షో. అంతే మెగాస్టార్‌ కదా. ఆయన ఏం చేసినా అంతే. మెగా రేంజ్‌లోనే ఉంటుంది.

ఆయన్ని కలవడానికి వచ్చిన సామాన్యుల దగ్గర నుండీ, ప్రముఖ సెలబ్రిటీస్‌ వరకూ ఎంతో ఆనందం, సంతోషం వ్యక్తం చేశారు. మళ్లీ ఎప్పుడెప్పుడు ఈ సీజన్‌ స్టార్ట్‌ అవుతుందా అని ఆడియన్స్‌ ఎదురు చూస్తూనే ఉంటారు. ఏదేమైనా చిరంజీవి రాకతో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి మెగా గ్లామర్‌ వచ్చిందనడం నిస్సందేహం. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular