HomeMovie News Teluguకొరటాల శివ సినీ రాజకీయం

కొరటాల శివ సినీ రాజకీయం

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఉండబోతుందన్న సంగతి తెలిసిందే. ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి పెట్టారు. ఈ సినిమాలో మహేష్‌ని పవర్‌ ఫుల్‌ పొలిటీషియన్‌గా చూపించబోతున్నారట కొరటాల శివ. మరో పక్క ఎన్టీఆర్‌తో కొరటాల శివ మరో సినిమా చేయబోతున్నారు. ఇది కూడా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లోనే ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు 2019 ఎలక్షన్స్‌ని బేస్‌ చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట కొరటాల శివ.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని పొలిటీషియన్‌గానే చూపించబోతున్నాడు కొరటాల అంటూ బాగా ప్రచారం జరుగుతోంది. అయితే కొరటాల శివ సినిమాల్లో సామాజిక బాధ్యత ఎక్కువగా ఉంటుంది. సామాజిక అంశాల్ని ఎక్కువగా తన సినిమాలో పొందు పరుస్తూ ఉంటారు ఆయన. గతంలో ఊరు దత్తత నేపథ్యంలో మహేష్‌బాబుతో కొరటాల తీసిన సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా, రియల్‌ లైఫ్‌లో ఆ సినిమా చూసి చాలా మంది ప్రముఖులు ఇన్‌స్పైర్‌ అయ్యారు.

అదే తరహాలో ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా అదే తరహాలో ఉండబోతున్నాయట. ఈ సినిమా తర్వాత చరణ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది కొరటాల శివ. సో ఇప్పుడప్పుడే కొరటాల డైరీ ఖాళీ అయ్యేట్లు లేదు. ఆయన డైరీ అంతా టోటల్‌గా పొలిటికల్‌ ఫ్లేవర్‌తో నిండిపోయినట్లే ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular