HomeMovie News Teluguఅప్పుడు మహేష్‌, ఇప్పుడు అల్లు అర్జున్‌

అప్పుడు మహేష్‌, ఇప్పుడు అల్లు అర్జున్‌

బస్‌ టికెట్‌ కావాలా? అంటూ టాలీవుడ్‌ హీరోలు అభిమానుల్ని అలరిస్తున్నారు. రెడ్‌ బస్‌, అభి బస్‌ లాంటి పేర్లతో ఆన్‌లైన్‌లో, మొబైల్‌ యాప్‌ ద్వారా బస్‌ టిక్కెట్లు విక్రయించే సంస్థలు, తమ ప్రచారం నిమిత్తం స్టార్లను తీసుకొస్తున్నాయి. అభి బస్‌ కోసం సూపర్‌ స్టార్‌ మహేష్‌ ఇప్పటికే ప్రచారకర్తగా పనిచేస్తుండగా, లేటెస్ట్‌ ఎంట్రీ ఇచ్చాడు రెడ్‌ బస్‌తో స్లైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. దేనికదే విభిన్నంగా ఉండేలా ఈ యాడ్స్‌ రూపొందుతున్నాయి. దాంతో అంతా ఈ ప్రకటనలకు ఆకర్షితులవుతున్నారు.

మహేష్‌ చేసిన ప్రకటనల్లో టాలీవుడ్‌ నటుడు కృష్ణుడు కనిపించాడు. కృష్ణుడి భారీ తనం మీద ఆ ప్రకటనలో మహేష్‌ సెటైర్లు వేయడం చాలా ఫన్నీగా అన్పించింది. అల్లు అర్జున్‌ ప్రకటనని ఇంకా స్టైలిష్‌గా చూపించారు. అదే సమయంలో మాస్‌లో బన్నీకి ఉన్న ఫాలోయింగ్‌ దృష్ట్యా కొంత మాస్‌ టచ్‌ కూడా ఇచ్చారు. ఈ ప్రకటనలతో తమ మార్కెట్‌ మరింత పెరుగుతుందని ఆయా సంస్థలు చెప్పడం జరుగుతోంది.

ఇంకో వైపున ఈ తరహా ప్రకటనల విషయంలో మహేష్‌, అల్లు అర్జున్‌ మధ్య పోటీ తీవ్రంగానే ఉంది. బ్రాండింగ్‌ పరంగా టాలీవుడ్‌లో ఈ ఇద్దరూ దూసుకెళుతున్నారు. మిగతా హీరోలు కూడా బ్రాండింగ్‌లో తమ సత్తా చాటుతూనే ఉన్నారు. సినిమాల సంపాదన ఓ వైపు, ఈ బ్రాండింగ్స్‌తో సంపాదన ఇంకో వైపు డబుల్‌ ధమాకా అన్నమాట.

You May Like This
- Advertisment -spot_img

Most Popular