HomeMovie News Telugu'ఏంజెల్‌ 'హెబ్బాకి సీను చాలా ఉందబ్బా!

‘ఏంజెల్‌ ‘హెబ్బాకి సీను చాలా ఉందబ్బా!

‘కుమారి 21 ఎఫ్‌’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏంజెల్‌’. నాగ అన్వేష్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ చూస్తే ఏదో ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ అనుకునేరు. కానీ ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపధ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేశారట. అవి కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయట. చిన్న సినిమానే అయినా కానీ పెద్ద సినిమా తరహాలో రూపొందించారట గ్రాఫిక్స్‌.

ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌ ఇంత వరకూ బబ్లీ గాళ్‌గా ఫాస్ట్‌గా ఉన్న క్యారెక్టర్స్‌లోనే కనిపించింది. ఈ సినిమాలో ఏంజెల్‌ పాత్రలో చాలా అందంగా క్యూట్‌గా కనిపించనుందట. అలాగే సినిమా స్టోరీ అంతా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటుందట. యాక్టింగ్‌లో హెబ్బాకి మంచి పేరే ఉంది. ఈ సినిమాలో ఆమెది నటనా ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో మరికొంచెం కష్టపడిందట ఈ సినిమా కోసం.

ప్రముఖ డైరెక్టర్‌ రాజమౌళి వద్ద శిష్యరికం తీసుకున్న డైరెక్టర్‌ పళని. ఈయన ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది ‘ఏంజెల్‌’ చిత్ర యూనిట్‌. మే నెల 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular