HomeMovie News Teluguమిల్కీ బ్యూటీ తమన్నా ఎక్కడ?

మిల్కీ బ్యూటీ తమన్నా ఎక్కడ?

సినిమా ప్రమోషన్స్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పుడూ ముందుంటుంది. అలాంటిది ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘బాహుబలి’ మేనియా నడుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది మిల్కీ బ్యూటీ తమన్నా. అయితే సినిమా విడుదలయ్యాక తమన్నా ఎక్కడా కనిపించింది లేదు. ప్రమోషన్‌లో భాగంగా ఎక్కడో అక్కడ మిల్కీ బ్యూటీ తళుక్కున మెరవాల్సి ఉంది. కానీ ఎక్కడా కనిపించడం లేదు. కనీసం సోషల్‌ మీడియాలో కూడా ఎక్కడా అమ్మడు స్పందించడం లేదు.

దాంతో ఆమె అభిమానులు చాలా డిజప్పాయింట్‌ అవుతున్నారు. మరో పక్క అసలే సినిమాలో తమన్నా పాత్రకు నిడివి ఎంతో లేదు. మొదటి పార్ట్‌లో ఉద్యమ నాయకురాలిగా కనిపించిన తమన్నా, రెండో పార్ట్‌లో ఆమె పాత్రకు మరింత ప్రాధాన్యత ఉంటుందని భావించారు అభిమానులు. కానీ క్లైమాక్స్‌ వరకూ తమన్నా పాత్ర కనిపించలేదు. సరికదా.. క్లైమాక్స్‌లో కూడా ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. సినిమా విడుదలకు ముందు చాలా సార్లు తమన్నా తన పాత్ర విషయంలో చాలా గొప్పగా చెప్పడం విన్నాం.

దాంతో ఫ్యాన్స్‌ ఆమె క్యారెక్టర్‌ విషయంలో చాలా ఎక్స్‌పెక్ట్‌ చేశారు. తీరా సినిమా చూసేసరికి తమన్నాకి అంత సీను లేదని తేలిపోయింది. అయితే తమన్నా నటించిన సీన్లు చాలా వరకూ కటింగ్స్‌ కూడా పడిపోయాయట. ఇదంతా చూసి తమన్నా ఎక్కడ ఎక్కడ అంటూ ఆమె అభిమానులు తెగ కలవరిస్తున్నారు. అసలింతకీ మిల్కీ బ్యూటీ ఎక్కడుంది? ఏం చేస్తోంది? ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవాయె!

You May Like This
- Advertisment -spot_img

Most Popular