HomeMovie News Teluguమెగా న్యూస్‌ ఎప్పుడొస్తుందో!

మెగా న్యూస్‌ ఎప్పుడొస్తుందో!

మెగాస్టార్‌ దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తొమ్మిదేళ్ల తర్వాత వచ్చిన ఆయన 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్‌ 150’తో రికార్డుల మోత మోగించేశాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఆ సినిమా తర్వాత చిరంజీవి వరుసగా సినిమాలు చేసేస్తారనుకున్నారు. కానీ మెగాస్టార్‌ నుండి రాబోయే 151వ సినిమా చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలని అనుకుంటున్నారట. మాస్‌ మసాలా యాక్షన్‌లా తలపిస్తూనే, ఓ మెసేజ్‌ని కూడా తీసుకొచ్చారు ‘ఖైదీ’ సినిమాతో చిరంజీవి. తర్వాతి సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అనుకున్నారంతా.

కానీ ఇది కూడా ప్రయోగాత్మక చిత్రం అయితేనే బాగుంటుందనుకుంటున్నారట. డైరెక్టర్‌ రెడీగానే ఉన్నారు. అయితే స్టోరీ విషయంలోనే క్లారిటీ లేదు. ప్రస్తుతం చిరంజీవి ‘ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి’ బయోపిక్‌లో నటించనున్నారట అనే ప్రచారం బాగా జరుగుతోంది. అయితే ఈ సినిమా తెరకెక్కడానికి చాలా టైం పడుతుందనుకున్నారు కానీ, చిరంజీవి తదుపరి చిత్రమే ‘ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి’ అని తాజాగా టాక్‌ వినిపిస్తోంది.

భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను కూడా రామ్‌ చరణే నిర్మించాలనుకుంటున్నారట. అయితే ఈ బయోపిక్‌ని తెరకెక్కించడం అంత ఆషామాషీ విషయం కాదు. అందుకు చాలా గ్రౌండ్‌ వర్క్‌ చేయాలి. ఆల్రెడీ ఈ దిశగా కసరత్తులు జరుగుతున్నాయని సమాచారమ్‌. సో మెగాస్టార్‌ నుండి రాబోయే సినిమా ‘ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి’ బయోపిక్‌ అన్నది ఫిక్స్‌ అయిపోయినట్లే అని తెలుస్తోంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular