HomeMovie News Teluguబిగ్‌బీ అమితాబ్‌ సమన్యాయం

బిగ్‌బీ అమితాబ్‌ సమన్యాయం

ఇండియన్‌ సినీ స్క్రీన్‌ మీద అమితాబ్‌ది ఓ ప్రత్యేక స్థానం. ఇంత వయసు వచ్చినా ఆయనకున్న స్టార్‌డమ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆయనకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. సామాజిక అంశాల పట్ల ఆయనకి పట్టు ఎక్కువ. అందుకే తన ఆస్థుల్ని కొడుకుతో పాటు కూతురుకి కూడా సమానంగా పంచాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయం సోషల్‌ మీడియా ద్వారా ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఆయన చేసిన ఈ సమన్యాయానికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రతీ విషయంలోనూ మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. ఆ వివక్షతని రూపుమాపేందుకే తన వంతుగా బిగ్‌బీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం స్వాగతించదగ్గదే. అలాగే ఇతర రంగాల్లో కూడా మహిళలకు అన్ని విషయాల్లోనూ సమాన హక్కులు కల్పించాలి. పురుషులతో పాటు అన్ని రంగాల్లోనూ సమానంగా ప్రమేయం కల్పించాలి.

మహిళలు పురుషుల కన్నా తక్కువేమీ కాదు. అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా తమ సత్తా చాటగలరనీ సమాజం గుర్తించాలి. అప్పుడే ఈ వివక్షని అరికట్టగలం. ఈ నిర్ణయంతో సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ రీల్‌ మీదే కాకుండా రియల్‌గా కూడా స్టార్‌ అనిపించుకున్నారు. బిగ్‌బీ నటించిన ‘సర్కార్‌’ సినిమా అప్పట్లో సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌ ‘సర్కార్‌ 3’ రాబోతోంది. రామ్‌ గోపాల్‌ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular