HomeMovie News Teluguకోర్టు మెట్లెక్కిన సూపర్‌ స్టార్‌ అల్లుడు

కోర్టు మెట్లెక్కిన సూపర్‌ స్టార్‌ అల్లుడు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు, తమిళ హీరో ధనుష్‌ కోర్టు మెట్లెక్కవలసి వచ్చింది. పుట్టుమచ్చల లెక్క తేల్చడానికి న్యాయస్థానం ధనుష్‌ని తమ యెదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. దాంతో ఆయన కోర్టుకు వెళ్ళారు. కదిరీశన్‌, మీనాక్షి దంపతులు ధనుష్‌ తమ కుమారుడేనని ఆరోపిస్తున్నారు. 2002లో నటుడైనప్పటినుంచీ ధనుష్‌ తమను పట్టించుకోవడంలేదని వారు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ జీవనానికి సరిపడేలా ఖర్చులను ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే ధనుష్‌ తమ కుమారుడేనని తమిళ దర్శకుడు కస్తూరి రాజా అంటున్నారు. కస్తూరి రాజాకి ఇద్దరు కుమారులు కాగా, అందులో ధనుష్‌ ఒకడు. ఇది ప్రపంచానికి తెలిసిన విషయం. మధ్యలో ఈ కదిరీశన్‌ దంపతుల వ్యవహారమేమిటో ఎవరికీ అర్థం కావడంలేదు. ధనుష్‌ తమ కుమారుడేననడానికి కొన్ని పుట్టుమచ్చల ఆధారాల్ని న్యాయస్థానానికి కదిరీశన్‌ దంపతులు అందించారు. వాటి ఆధారంగా న్యాయస్థానం విచారణ చేపట్టి, ధనుష్‌ని న్యాయస్థానానికి పిలిపించింది.

పుట్టుమచ్చల్ని జ్యుడీషియల్‌ ఛాంబర్‌లో వెరిఫికేషన్‌ చేస్తున్నారు. కేసు విచారణ మార్చ్‌ 2వ తేదీకి వాయిదా పడింది. తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో ధనుష్‌ నటించాడు. ధనుష్‌ నటించిన తమిళ సినిమాలు కొన్ని తెలుగులోకి డబ్‌ అవగా, ఇంకొన్ని రీమేక్‌ అయ్యాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular