HomeMovie News Telugu'కాటమరాయుడి'కి తమ్ముడి 'ఖడ్గం'

‘కాటమరాయుడి’కి తమ్ముడి ‘ఖడ్గం’

తన అభిమాన హీరోకి ఓ అరుదైన బహుమతినివ్వాలనుకున్నాడు. ఆ బహుమతితో తన అభిమాన హీరో ఆశ్చర్యపోయేలా చేయాలనుకున్నాడు ఆ అభిమాని. ఆ అభిమానికి తన అభిమాన హీరోతో కలిసి నటించే అవకాశం రావడమే మహాద్భుతం. దాన్ని మించిన అద్భుతమేమిటంటే, ఆ అభిమాని పుట్టినరోజుని సెట్‌లో అతను ఆశ్చర్యపోయేలా ఆ అభిమాన హీరో చేయడం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తాను ఇవ్వాలనుకుంటున్న బహుమతిని చాలా ప్రత్యేకంగా ఉండాలనుకున్నాడు ఆ అభిమాని.

ఆలోచన వచ్చిందే తడవు, దాన్ని ఆచరణలో పెట్టేశాడు. ఓ ఖడ్గాన్ని బహుమతిగా ఊహించుకుని, ఆ ఖడ్గాన్ని తన అభిమాన హీరోకి బహుమతిగా ఇచ్చాడు. ఇక్కడ బహుమతి ఇచ్చిన అభిమాని శివబాలాజీ అయితే, బహుమతి అందుకున్న హీరో పవన్‌కళ్యాణ్‌. ఆ ఖడ్గమ్మీద జనసేన పార్టీ పేరుని పొందుపర్చారు. ‘ఖడ్గాన్ని పవన్‌కళ్యాణ్‌కి ఇస్తున్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయిన తీరు ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రియాక్షన్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.’ అని అన్నాడు శివబాలాజీ.

పవన్‌కళ్యాణ్‌ ప్రజల వీరుడు. స్టార్‌ హీరో అయినా తోటి నటీనటుల పట్ల ఎంతో సరదాగా ఉంటారాయన. ఆయన్ని దగ్గర్నుంచి చూసే అవకాశం, ఆయనతో నటించే అవకాశం చాలా అద్భుతమని శివబాలాజీ చెప్పాడు. గతంలో శివబాలాజీ, పవన్‌కళ్యాణ్‌తో ‘అన్నవరం’ సినిమాలో నటించాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular