HomeMovie News Teluguబుల్లితెరపై మెగాస్టార్‌ మెగా జోష్‌

బుల్లితెరపై మెగాస్టార్‌ మెగా జోష్‌

తొమ్మిదేళ్ళ విరామం తర్వాత వెండితెరపై హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్‌ చేసేశారు. చిరంజీవిలో ఒకప్పటి జోష్‌, గ్రేస్‌ చూసి తెలుగు సినీ పరిశ్రమ ఆశ్చర్యపోయింది, ప్రేక్షక లోకం పులకించిపోయింది. రికార్డులు ఆయనకు వంగి వంగి సలాం చేశాయి. ఇప్పుడీ మెగాస్టార్‌ చిరంజీవి బుల్లితెరపై అలరిచడానికి సిద్ధమయ్యారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్‌ షోతో బుల్లితెర వీక్షకుల ముందుకు వస్తున్న చిరంజీవి, టీఆర్పీ రేటింగుల గత రికార్డుల్ని తిరగరాయడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

నాగార్జున గతంలో ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించగా, చిరంజీవి రాకతో ఇప్పుడు ఈ షోకి మెగా గ్లామర్‌ వచ్చిందనడం నిస్సందేహం. ప్రోమోస్‌తోనే ఈ షో మీద హైప్‌ ఏర్పడింది. నేటి రాత్రి నుంచి ఈ షో ప్రసారం కానుండగా, పార్టిసిపెంట్లతో చిరంజీవి చిన్న చిన్న డాన్స్‌ మూమెంట్స్‌ వేయడం చూసి బుల్లితెర వీక్షలు ఇంకా ఉత్కంఠగా ఈ షో కోసం ఎదురుచూస్తున్నారు. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ నిర్వహించిన ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ తరహాలో తెలుగులో వస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఇక్కడా పెద్ద సక్సెస్‌ అయ్యింది. ఆ సక్సెస్‌కి కొనసాగింపుగా మెగా సక్సెస్‌ అనే స్థాయిలో ఈ షో వీక్షకుల్ని అలరిస్తుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

ఇంకో వైపున మెగాస్టార్‌ అభిమానులైతే బుల్లితెరపై తమ మెగా బాస్‌ని తనివితీరా చూసుకోవాలన్న ఆతృతతో ఉన్నారు. వెండితెరపై తనదైన ముద్ర వేసిన మెగాస్టార్‌, బుల్లితెరపై వేయబోయే ముద్ర ఎలా ఉంటుందో వేచి చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular