HomeMovie News Teluguప్రభాస్ కొత్త సినిమాకి ముహూర్తం ఫిక్స్

ప్రభాస్ కొత్త సినిమాకి ముహూర్తం ఫిక్స్

రెబల్ స్టార్ ప్రభాస్ ఎట్టకేలకు బాహుబలి తర్వాత కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

యంగ్ డైరెక్టర్ సుజీత్ రెండేళ్ళ నిరీక్షనకి తెర పడినట్టయింది. ఇక వివరాల్లోకి వెళితే, ప్రభాస్-సుజీత్ చిత్రం రేపు ప్రారంభం అవబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యువి క్రియేషన్స్ దీనిని నిర్మిస్తుండగా ఈ చిత్రం యొక్క    బడ్జెట్ భారీగానే ఉండబోతుంది అని ఫిలిం నగర్ వర్గాల టాక్.

అయితే ఈ సినిమాకి సంబందించిన కీలక సమాచారం అంతా రేపు జరగబోయే ప్రారంబోత్సవ సందర్భంగా తెలుస్తుంది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఒక టాప్ హీరోయిన్ ఈ చిత్రానికి సైన్ చేయబోతుందట.

ఏదైతే ఏంటి చివరకు ప్రభాస్ బాహుబలి తర్వాత ఒక కొత్త సినిమాకి ఒకే చెప్పితన ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త చెప్పాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular