HomeMovie News Teluguబాహుబలి 2ని వీక్షించనున్న ఇంగ్లాండ్ మహారాణి

బాహుబలి 2ని వీక్షించనున్న ఇంగ్లాండ్ మహారాణి

రాజమౌళి దర్శకత్వ ప్రతిభకే కాకుండా భారతదేశ స్థాయిని సైతం అమాంతం పెంచేసిన చిత్రం “బాహుబలి”.

ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూనే ఉంది. ఇక బాహుబలి సినిమా చరిత్రలో ఒక గొప్ప సంఘటనగా గుర్తుండిపోయే విశేషం జరగనుంది.

అదేంటంటే, ఇంగ్లాండ్ మహారాణి ఎలిజబెత్ II మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించనున్నారు. ఈ అపూర్వ సంఘటన  ఏప్రిల్ 24వ తేదిన లండన్ లో జరగనుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 70 యేండ్లు అవుతున్న సంధర్బంలో లండన్ లో జరిగే కార్యక్రమాల్లో బాహుబలి 2 స్క్రీనింగ్ కూడా ఒకటి.

ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి రాజమౌళి తో పాటుగా చిత్ర బృందం కూడా హాజరవుతారు అని సమాచారం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular