HomeMovie News Teluguపాపులర్ హాస్యనటుడి పైన పోలీస్ కేసు!

పాపులర్ హాస్యనటుడి పైన పోలీస్ కేసు!

పాపులర్ కామెడీ షో- జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మాస్ అవినాష్ పై పోలీస్ కేసు నమోదయింది.

తెలియవస్తున్న సమాచారం ప్రకారం, మహాశివరాత్రి సందర్బంగా కర్నూలు లో జరిగే ఒక కార్యక్రమానికి హాజరయ్యే నేపధ్యంలో అవినాష్ నిర్వాహకుల నుండి 10వేలు అడ్వాన్సు తీసుకొన్నాడు. అయితే ఆరోజు కార్యక్రమానికి మాత్రం వెళ్ళలేదు.

ఈ తరుణంలో, ఆర్గనైజర్ వేణుగోపాల్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. అవినాష్ రాకపోవడంతో తన ఈవెంట్ కంపెనీ పేరు చెడిపోయిందని అలాగే తన రాలేకపోయిన కారణాలు కుడా చెప్పడం లేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

దీనితో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular