HomeMovie News Teluguశృతిహాసన్‌కి ఆ ఒక్కటే లోటు

శృతిహాసన్‌కి ఆ ఒక్కటే లోటు

సౌత్‌ హీరోయిన్లకు బాలీవుడ్‌లో ఛాన్స్‌ వచ్చిందంటే ఆ ఆనందమే వేరు. కానీ ముద్దుగుమ్మ శృతిహాసన్‌కి మాత్రం ఈ విషయంలో రివర్స్‌గా జరిగింది. ఆమె నటిగా పరిచయం అయ్యింది మొదట్లో హిందీలోనే. ‘లక్‌’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకి అక్కడ అంతగా లక్‌ కలిసి రాలేదు. హిందీలో పలు చిత్రాల్లో నటించినా, కానీ శృతికి ఆశించిన గుర్తింపు అక్కడ దక్కలేదు. కానీ తెలుగులోనూ, తమిళంలోనూ ఆమెకు మంచి అవకాశాలు దక్కడంతో పాటు, స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ని కూడా సొంతం చేసుకుంది.

తెలుగులో హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్‌లో కూడా నటించి మెప్పించింది. పవన్‌తో నటించిన ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాతో శృతి దశ తిరిగిపోయింది. ఆ తర్వాత వరుస హిట్లు అందుకుంటూ తెలగులో తిరుగులేని హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మళ్లీ పవన్‌తో ‘కాటమరాయుడు’ సినిమాలో శృతి నటిస్తోంది. తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి ‘శభాష్‌ నాయుడు’ సినిమా. ఇది తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. విశ్వనటుడు కమల్‌ హాసన్‌ నటిస్తూ, దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. తొలి సారిగా తండ్రీ కూతుళ్లిద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా కూడా ఇదే.

ఇదంతా బాగానే ఉంది. కానీ శృతికి బాలీవుడ్‌ సినిమాల్లో నటించడమంటేనే ఎక్కువ ఇష్టమంట. తాజాగా సౌత్‌ నుండి వెళ్లి, బాలీవుడ్‌లో మంచి ఆఫర్స్‌ దక్కించుకుంటోన్న హీరోయిన్లని చూసి శృతి హాసన్‌కి అసూయగా ఉందట. అందుకే బాలీవుడ్‌లో మంచి ఆఫర్‌ కోసం ఎప్పటికీ తాను ఎదురు చూస్తూనే ఉంటానంటోంది ముద్దుగుమ్మ శృతిహాసన్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular