HomeMovie News Teluguబాలకృష్ణ-మోక్షజ్ఞ ఒకే ఫ్రేమ్ లో!!

బాలకృష్ణ-మోక్షజ్ఞ ఒకే ఫ్రేమ్ లో!!

నటసింహం నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి విజయంతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలకి కృతజ్ఞతలు తెలిపే పనిలో భాగంగా ఈ రోజు తన టీంతో కలిసి అమెరికాకి బయలుదేరనున్నాడు. మరోవైపు తన కుమారుడి తెరంగేట్రం పై వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పందించాడు.ఆ సందర్బంలోనే ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా బయట పెట్టాడు. అదేంటంటే తను తన బిడ్డ కలిసి నటించే అవకాశం ఉందని అది కూడా ఆదిత్య999లో మాత్రమే అని స్పష్టం చేశాడు.

ఆదిత్య999 కథ అయితేనే తనకి మోక్షజ్ఞకి సరిపోయే కథ అవుతుందని అలాగే కథల విషయంలో ఏనాడూ తన జడ్జ్మెంట్ తప్పు కాలేదని చెప్పాడు. ఇప్పటికే ఆదిత్య999కి సంబంధించి బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. చివరగా ఈ ఒక్క సినిమాలోనే తన కొడుకు పక్కన నటిస్తానని ఆ తర్వాత కలిసి నటించే యోచన ప్రస్తుతానికైతే  లేదని మనసులో మాట చెప్పాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular