HomeMovie News Teluguబుర్రాకి మతిపోయే గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య

బుర్రాకి మతిపోయే గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య

తనకు నచ్చిన వాళ్ళకోసం ఏదైనా చేసే సు’గుణం’ బాలకృష్ణ సొంతం. అతని సన్నిహిత వర్గాలు ప్రతిసారి అనే మాట “బాలయ్య బాబు ప్రేమ సముద్రం అలాగే అతని కోపం కూడా ప్రళయమే అంటారు’ ఈ వ్యక్తిత్వమే అతన్ని ఫిలిం ఇండస్ట్రీ లో “భోలా బాలయ్య” ని చేసింది.

ఇక విషయానికి వస్తే, తన కెరీర్ లోనే భారీ విజయాన్ని అందించడం లో కీలక పాత్ర పోషించిన మాటల రచయత సాయి మాధవ్ బుర్రాని ఒక గోల్డ్ చెయిన్ తో సత్కరించాడు. అకస్మాతుగా జరిగిన ఈ సంఘటనకి సాయి మాధవ్ ఆనందానికి, ఉద్వేగానికి ఒకేసారి లోనయ్యాడు. అన్నిటికంటే ఆసక్తికర విషయమేమిటంటే, స్వతాహ బాలకృష్ణ వీరాభిమాని అయిన సాయి మాధవ్ కి బాలకృష్ణతో పనిచేయడమే పెద్ద బహుమతి అనుకుంటుంటే ఈ సడన్ గిఫ్ట్ అతని ఆనందాన్ని డబుల్ చేసింది.

ఇంతకమునుపు కూడా బాలయ్య ఇలాగే తనకు అద్భుతంగా డైలాగ్స్ అందించినందుకు రైటర్ చిన్నికృష్ణకు కూడా గోల్డ్ చెయిన్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ సంఘటన చూస్తుంటే బాలయ్య నిజంగా మహారాజే అనిపిస్తుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular