HomeMovie News Teluguఎన్టీయార్‌ లుక్‌ ఎలా ఉంటుందో!

ఎన్టీయార్‌ లుక్‌ ఎలా ఉంటుందో!

ఎన్టీయార్‌ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళడానికి రంగం సిద్ధమవుతోంది. అయితే ఇంతవరకు ఈ సినిమాలో ఎన్టీయార్‌ ఎలాంటి లుక్‌తో కనిపిస్తాడో క్లారిటీ లేదు. ఇప్పటికైతే ఎన్టీయార్‌ పూర్తి గడ్డంతోనే కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీయార్‌ మూడు రోల్స్‌ చేయనుండగా అందులో ఓ గెటప్‌ గడ్డంతో ఉంటుందని సమాచారమ్‌. మిగతా రెండిట్లో ఒకటి చాలా స్టయిలిష్‌గా ఉంటుందని అంటున్నారు.

‘జై లవ్‌ కుష్‌’ అనే పేరుని ఈ సినిమా కోసం పరిశీలిస్తుండగా దీని గురించి ఇంతవరకు ఎలాంటి స్పష్టతా లేదు. ఎన్టీయార్‌ సోదరుడు, సినీ నటుడు కళ్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తాడు. త్వరలో సినిమా ప్రారంభం కానుండగా, ఎన్టీయార్‌ ఇలాంటి లుక్‌తో కనిపించవచ్చునని అభిమానులు కొన్ని గెటప్స్‌ని డిజైన్‌ చేసి సోషల్‌ మీడియాలోకి వదులుతున్నారు. గ్రాఫిక్స్‌ పరంగా అభిమానులు చాలా అడ్వాన్స్‌గా ఉండటం మామూలే.

టైటిల్‌ని, అలాగే ఎన్టీయార్‌ గెటప్‌ని కూడా డిజైన్‌ చేసి అభిమానులు సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంటే ఇదేనా ఒరిజనల్‌ గెటప్‌ అనేలా కొన్ని గెటప్స్‌ పాపులర్‌ అయిపోతున్నాయి. ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’ వంటి వరుస హిట్స్‌ తర్వాత ఎన్టీయార్‌ చేయబోయే సినిమాపై భారీ అంచనాలుండడం సహజమే. ఆ అంచనాలకు మించేలా బాబీ, ఎన్టీయార్‌తో సినిమాని పట్టాలెక్కించబోతున్నాడట.

You May Like This
- Advertisment -spot_img

Most Popular