లెజెండరీ స్టార్ బాలకృష్ణ-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ-2’ (Akhanda 2) ట్రైలర్ చివరకు విడుదలైంది. కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో చిత్రయూనిట్ ట్రైలర్‌ను లాంచ్ చేసింది.
ట్రైలర్ చూస్తుంటే బాలయ్య పవర్‌ఫుల్ డైలాగులు, మంచుకొండల్లో జరిగే హై-ఆక్షన్ సీక్వెన్సులు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సనాతన ధర్మం నేపథ్యంగా ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ స్పష్టంగా సూచిస్తోంది.
ముఖ్యంగా –
“ఇప్పటి వరకూ ప్రపంచ పటంలో మా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావ్.. మా దేశ విశ్వరూపాన్ని చూసుండవ్..” అనే బాలకృష్ణ డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలుస్తోంది.
ఈసారి VFX, గ్రాఫిక్స్ పనితనం మరింత మెరుగ్గా ఉన్నట్లు విజువల్స్ చూస్తే అర్ధమవుతోంది. మొత్తం మీద ట్రైలర్ చూసిన అభిమానులు “బాలయ్య విశ్వరూపం చూపించాడు” అంటూ సోషల్ మీడియాలో ఫుల్ హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో బాలకృష్ణ ఓ సాధారణ వ్యక్తిగా, మరో కోణంలో అఘోరా అవతారంలో కనిపించనున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే సినిమా నుంచి ది తాండవం, జాజికాయ వంటి లిరికల్ సాంగ్స్ విడుదల కాగా, చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.





