మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో టీమిండియా ఘన విజయం సాధించి ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మహిళా క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురుస్తుండగా, గుజరాత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు రాజ్యసభ సభ్యుడు గోవింద్ ఢోలాకియా టీమిండియా అమ్మాయిలకు బంపర్ గిఫ్ట్ ప్రకటించారు.
ఢోలాకియా ప్రకటించిన ప్రకారం, ప్రపంచ కప్ విజేతలైన భారత మహిళా జట్టు సభ్యులందరికీ వజ్రాల నెక్లెస్‌లు మరియు సోలార్ ప్యానెళ్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇక వివరాల్లోకి వెళ్తే – ఫైనల్ మ్యాచ్‌కు ముందు గోవింద్ ఢోలాకియా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాసి,
“ఫైనల్లో భారత మహిళా జట్టు విజయం సాధిస్తే, ప్రతి సభ్యురాలికి డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇస్తాను”
అని హామీ ఇచ్చారు.
ఇప్పుడు టీమిండియా మహిళల జట్టు ప్రపంచ కప్ గెలవడంతో, ఢోలాకియా తన మాట నిలబెట్టుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన, త్వరలోనే జట్టు సభ్యులందరికీ వజ్రాల నెక్లెస్‌లు మరియు సోలార్ ప్యానెళ్లు అందజేస్తానని వెల్లడించారు.
ఇది గోవింద్ ఢోలాకియా అందిస్తున్న గిఫ్ట్‌లలో కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పండుగల సందర్భాల్లో ఇళ్లు, కార్లు, ఆభరణాలు వంటి బహుమతులు అందజేశారు.
మరోవైపు, ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన క్రాంతి గౌడ్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.1 కోటి నగదు బహుమతి ప్రకటించింది. ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.





