టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. RRR సినిమా విజయంతో పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు ప్రపంచస్థాయి ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు. తాజాగా దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి కొత్త సినిమా చేస్తున్నారు.
వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి తాత్కాలికంగా ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. అయితే టైటిల్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ అభిమానుల కోసం మంచి వార్త బయటకు వచ్చింది.
అందుతున్న సమాచారం ప్రకారం, డ్రాగన్ సినిమా షూటింగ్ ఈ నెల మూడవ వారంలో మళ్లీ పునఃప్రారంభం కానుంది. నార్త్ యూరప్‌లో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించేందుకు ప్రశాంత్ నీల్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కోసం ఎన్టీఆర్ రెండు నెలల పాటు విదేశాల్లో ఉండనున్నారని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.





