HomeMovie News Teluguఈ సినిమా చూసి షాక్ కాకపోతే.. నేను ఇండస్ట్రీ వదిలేస్తా!.. రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

ఈ సినిమా చూసి షాక్ కాకపోతే.. నేను ఇండస్ట్రీ వదిలేస్తా!.. రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఒకప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సినిమాల్లో నటించడమే కాకుండా, పలు ఈవెంట్లలో వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా వార్తల్లో నిలుస్తుంటారు.

ప్రస్తుతం రవితేజ హీరోగా నటించిన ‘మాస్ జాతర’ (Mass Jathara) చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఆయన మాట్లాడుతూ, “మాస్ జాతర సినిమా చూసి మీరు షాక్ కాకపోతే నేను సినిమా ఇండస్ట్రీ వదిలేస్తాను. అన్ని మసాలాలు సరిగ్గా ఉన్న మాస్ సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. ఆ లోటును తీర్చేది ఈ సినిమా. మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకు చాలా మంది హీరోలతో పనిచేశాను కానీ రవితేజతో మాత్రం అవకాశం రాలేదు. ‘మాస్ జాతర’ కోసం ఇంత సమయం పట్టినట్టుంది. దర్శకుడు భాను అద్భుతమైన సినిమాను తీశాడు. ఇందులో యాక్షన్, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. ఇది అద్భుతమైన మాస్ ఎంటర్టైనర్” అని అన్నారు.

ఈ సినిమాలో రవితేజ, శ్రీలీల జంటగా నటించారు. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular