జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) కోసం బీజేపీ (BJP) తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి (Lankala Deepak Reddy) పేరును పార్టీ ఇవాళ ఖరారు చేసింది. ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు పలువురు నేతల పేర్లు చర్చలోకి వచ్చాయి. జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, విక్రమ్ గౌడ్ పేర్లు ముందంజలో ఉన్నప్పటికీ, పార్టీ అధిష్టానం చివరికి లంకల దీపక్ రెడ్డినే ఎంపిక చేసింది.

గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి, ఆ ఎన్నికలో మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడిగా పేరుపొందారు.
బీజేపీ అభ్యర్థి ప్రకటించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ (BRS) తరఫున మాగంటి సునిత ఇప్పటికే బరిలో ఉన్నారు. ఇక టికెట్ తనకే ఖాయం అని భావించిన జూటూరు కీర్తిరెడ్డికి అధిష్టానం ఇచ్చిన ఈ నిర్ణయం షాక్‌గా మారింది.





