HomeMovie News Telugu‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ రిలీజ్.. చిరు-నయనతార కెమిస్ట్రీ అదిరిందంటూ నెటిజన్ల రియాక్షన్!

‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ రిలీజ్.. చిరు-నయనతార కెమిస్ట్రీ అదిరిందంటూ నెటిజన్ల రియాక్షన్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ‘మీసాల పిల్ల’ ప్రోమోకు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.

భీమ్స్ సీసిరోల్ అందించిన సంగీతం, లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ వాయిస్, భాస్కరభట్ల రవికుమార్ రాసిన లిరిక్స్‌తో పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. చిరంజీవి, నయనతార మధ్య సన్నివేశాలు చక్కగా, క్యూట్‌గా తెరకెక్కాయి. ముఖ్యంగా చిరంజీవి నయనతారను టీజ్ చేస్తూ పాడిన లిరిక్స్‌లో ఉన్న “రాజీ పడదాం అంటే రావే మాజీ ఇల్లాల.. నువ్వు రోజూ పెట్టే నరకంలోకి మళ్లీ దూకాల” అన్న లైన్ చర్చనీయాంశంగా మారింది. ఈ లైన్ ద్వారా చిరంజీవి, నయనతార పాత్రలు మాజీ భార్యా భర్తలుగా ఉంటారన్న క్లూ ఇచ్చేశాడని అభిమానులు అంచనా వేస్తున్నారు.

మొత్తంగా, ఈ సాంగ్ మ్యూజిక్, లిరిక్స్, విజువల్స్‌తో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది. “మీసాల పిల్ల పాట అదిరిందే పిల్లా!” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పక్కా ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular