నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమాలకు ‘అఖండ’ నుంచి వరుసగా ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు సంగీత పరంగా కూడా మంచి ఆదరణ పొందాయి. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK111’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా కనిపించనుండగా, ఈ చిత్రాన్ని దసరా లేదా డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్.. ‘NBK111’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సంగీత పనుల్లో ఎక్కువ భాగం పూర్తయ్యిందని, సినిమా కోసం సిద్ధం చేసిన మ్యూజిక్ అద్భుతంగా వచ్చిందని తెలిపారు.
సంగీతంతో పాటు ఈ సినిమా విజువల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తమన్ చెప్పారు. ‘కాంతార’ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికీ పని చేస్తున్నారని, ఆయన బాలకృష్ణను ఎంతో పవర్‌ఫుల్‌గా చూపించారని వెల్లడించారు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో కనిపించిన బాలయ్య లుక్ కేవలం చిన్న శాంపిల్ మాత్రమేనని, సినిమాలో ఆయనను మరింత మాస్, పవర్‌ఫుల్ అవతార్‌లో చూడబోతున్నారని తమన్ అన్నారు. అలాగే ఈ చిత్రానికి ఓ అదిరిపోయే టైటిల్‌ను కూడా ఫైనల్ చేశారని, అది ప్రకటించిన తర్వాత సినిమాపై హైప్ మరింత పెరుగుతుందని చెప్పారు.
ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని తమన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నందమూరి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే సినిమా విడుదల తేదీ, టైటిల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





