HomeTeluguశ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ & రేటింగ్

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం: శ్రీనివాస మంగాపురం
దర్శకత్వం: అజయ్ భూపతి
కథ – రచన: అజయ్ భూపతి

నటీనటులు: జయ కృష్ణ ఘట్టమనేని, రాశా తడాని, మోహన్ బాబు, కిక్ శ్యామ్, శ్రీ తేజ్, వీకే న‌రేశ్‌, బ్ర‌హ్మాజీ, అజ‌య్, వాసుకి తదితరులు

నిర్మాతలు: జెమిని కిరణ్, అశ్విని దత్

సంగీతం: జీవీ ప్రకాష్
సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి
ఎడిటర్: మాధవ్ కుమారు గుల్లపల్లి

బ్యానర్: వైజయంతి మూవీస్
విడుదల తేదీ: 30 జూలై 2026

ఘట్టమనేని ఇంటినుంచి మూడోతరం వెండి తెరపై అడుగుపెట్టింది. కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి మించిన తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ “శ్రీనివాస మంగాపురం” సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందొ? ఘట్టమనేని వారసుడు హిట్ కొట్టాడో లేదో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ:

తిరుపతికి చెందిన పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్)కి కుటుంబం అంటే ప్రాణం. కుటుంభం కోసం ప్రాణాలివ్వటానికి కూడా వెనుకాడడు. తిరుపతిలో పెద్దిరెడ్డిదే హవా. అతని కూతురు మంగ (రాశా)ని చూడటానికి కూడా అంతా భయపడతారు. కానీ ఎక్కడినుంచో వచ్చిన శ్రీను (జై కృష్ణ) మంగని మొదటిసారి చూడగానే ప్రేమిస్తాడు. ఆమె ప్రేమకోసం వెంట తిరుగుతుంటాడు. ఈ సందర్భంలో శ్రీను ఒక సారి పెద్దిరెడ్డి తమ్ముడు సుబ్బారెడ్డి (శ్రీ తేజ్) కి దొరికిపోతాడు. కరక్ట్ గా అదే టైం లో సుబ్బారెడ్డిపై ప్రత్యర్థులు ఎటాక్ చేస్తారు. ఆ అటాక్ నుంచి సుబ్బారెడ్డిని శ్రీను కాపాడుతాడు. సుబారెడ్డి ప్రాణాలు కాపాడిన శ్రీనుని పెద్దిరెడ్డి ఇంటికి పిలిపిస్తారు. కొన్నాళ్ళకి మంగ, శ్రీను మధ్య స్నేహం కుదురుతుంది. ప్రేమ కథ మొదలవుతుంది అన్న సమయానికి మంగకి వేరే వాళ్ళతో పెళ్లి కుదురుతుంది. బళ్లారి నుంచి వచ్చిన మంగ మేనత్త (వాసుకి) శ్రీనుని కలిసి మంగని మర్చిపోమని హెచ్చరిస్తుంది. ఈ క్రమంలోనే శ్రీనుపై బళ్లారి గ్యాంగ్ అటాక్ చేస్తారు. అసలు శ్రీను ఎవరు? శ్రీను బళ్లారి నుంచి తిరుపతికి వచ్చి మంగ వెనుక పడటానికి కారణం ఏమిటి? ఈ కథలో బళ్లారి వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) పాత్ర ఏంటి ? పెద్ది రెడ్డికి, వెంకటప్ప నాయుడు మధ్య సంబంధం ఏమిటి? చివరకు వాసు, మంగ ఒక్కటయ్యారా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఆర్‌ఎక్స్ 100 లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ తీసిన అజయ్ భూపతి ఈసారి బోల్డ్ కంటెంట్ కు దూరంగా కుటుంబ ప్రేక్షకుల కోసం క్లీన్ కమర్షియల్ లవ్ స్టోరీ ట్రై చేసాడని చెప్పొచ్చు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు హీరో కావటం, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాశా హీరోయిన్ గా డెబ్యూ చేయడంతో శ్రీనివాస మంగాపురం సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాకా ఆ అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. కారణం కథ, కథనం రొటీన్ గా ఉంది. ఎమోషన్స్ కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్. ఇలాంటి కథలు ఇప్పటికే చాలా చూసారు ప్రేక్షకులు. ఏమాత్రం కొత్తదనం లేని కథతో పాటు 70, 80 స్ ఫార్మాలా సినిమాల కంటే దారుణంగా ఉంది. లవ్ సీన్స్, యాక్షన్ డ్రామా, కామెడీ ట్రాక్‌ అన్నీ రొటీన్ గా బోరింగ్ గా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే కూడా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. పాటలు టైమింగ్ వెరీ బ్యాడ్ గా ఉంది. బెస్ట్ యాక్టర్స్ ఉన్నా కథ, కథనాల్లో విషయం లేకపోవటంతో వారికి పెర్ఫార్మెన్స్ స్కోప్ లేకుండా పోయింది.

మొదటి అరగంటలోనే సినిమా మొత్తం అర్థం అయిపోతుంది. RX100, మంగళవారం లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న అజయ్ భూపతి ఇంత నాసిరకం కథ కథనం అందించటం ఆశ్చర్యం. ఘట్టమనేని ఇంటి వారసుడ్ని లాంచ్ చేయబోయే సినిమా అంటే ఎలా ఉండాలి ? ఊరు పేరు లేని హీరో సినిమా కూడా ఇలా ఉండదు. మోహన్ బాబు లాంటి సీనియర్ హీరోని కూడా వాడుకోలేకపోయాడు దర్శకుడు. హీరో, హీరోయిన్ల పై మొత్తం భారం వేసేయటం వారికి గుది బండలా మారింది. జయకృష్ణ కి మొదటి సినిమా ఒక బాడ్ ఎక్సపీరియన్స్ ఇచ్చిందనే చెప్పాలి.

నటీ నటులు:

జయ కృష్ణ తన పాత్రవరకు తాను కష్టపడ్డాడు. మొదటిసినిమా తోటే తలకి మించిన భారం మోశాడు. రాశా తడానీ కి తెలుగులో మొదటి సినిమా కావొచ్చు కానీ హిందీలో తాను ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసింది. కానీ శ్రీనివాస మంగాపురం లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. కారణం శక్తికి మించిన భారం. చాలా రోజుల తరువాత మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించినా ఆయన స్థాయికి తగిన పాత్ర కాదిది. ఎలాంటి ఇంపార్టెన్స్ లేని పాత్రలో మోహన్ బాబు కనిపించారు. సెకండాఫ్‌లో ఒకటి రెండు సీన్స్ లో కనిపిస్తారు. వాసుకి, కిక్ శ్యామ్, వడ్లమాని శ్రీనివాస్ పాత్రలకు మంచి స్కోప్ ఉన్నా దర్శకుడు ద్రుష్టి పెట్టలేదు. వీకే నరేష్, బ్రహ్మాజీ పాత్రలు, కామెడీ ట్రాక్ బోరింగ్‌గా, వెగటుగా ఉంది. కథలో పస లేకపోతె నటీ నటులు చేసేదేం ఉంటుంది.

టెక్నికల్:

టెక్నికల్ టీమ్ కూడా ఈ సినిమాకి ఎక్కువ కష్టపడలేదని తెలుస్తోంది. ఎడిటింగ్, పనితీరు కూడా అంత అంత మాత్రమే ఉంది. జీవీ ప్రకాశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా లేవు. ఘట్టమనేని వంశం నుంచి హీరోను పరిచయం చేసే స్థాయి ఉన్న సినిమా ఇది కాదని ఫాన్స్ నిరాశ చెందుతున్నారు.

ప్లస్ పాయింట్స్

జయ కృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్
జీవీ ప్రకాష్ సంగీతం
మోహన్ బాబు నటన

మైనస్ పాయింట్స్

రొటీన్ కథ
స్లో నేరేషన్
నో ఎమోషన్స్ & ట్విస్టులు

You May Like This
- Advertisment -spot_img

Most Popular