HomeMovie News Teluguఐటెం సాంగ్ లేకపోవడానికి కారణం ఇదే.. తమన్

ఐటెం సాంగ్ లేకపోవడానికి కారణం ఇదే.. తమన్

అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెరకెక్కిన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. ముఖ్యంగా ఈ సినిమాకు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి.

అయితే ప్రస్తుతం కమర్షియల్ సినిమాల్లో ఐటెం సాంగ్‌లు సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ, ‘లెనిన్’ చిత్రంలో అలాంటి పాట లేకపోవడం అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు తమన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తమన్ మాట్లాడుతూ, ‘లెనిన్’ కోసం తొలుత ఒక స్పెషల్ ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేశామని, ఆ పాటను కూడా పూర్తిగా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆ పాట కోసం పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలించామని చెప్పారు.

అయితే చివరకు ఆ పాట కథకు అంతగా సరిపోదని చిత్రబృందం భావించడంతో దాన్ని పూర్తిగా తొలగించినట్లు వెల్లడించారు. ఆ నిర్ణయం తనకు మొదట నిరాశ కలిగించినప్పటికీ, సినిమా కథకు ఏది అవసరమో అదే చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఆ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

రివ్యూల్లో ‘ఐటెం సాంగ్ కథకు అడ్డుగా మారింది’ అనే విమర్శలు రావొచ్చనే ఆలోచనతోనే ఆ పాటను తీసేయాలని నిర్ణయించుకున్నారని తమన్ తెలిపారు. సరైన కథనం కోసం కొన్ని సందర్భాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular