టాలీవుడ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలు తెరకెక్కించే వేగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో అత్యంత వేగంగా సినిమాలను పూర్తి చేస్తూనే వరుస విజయాలను అందుకుంటున్న దర్శకుడిగా ఆయన గుర్తింపు పొందారు. దీంతో అనిల్ రావిపూడితో సినిమా చేయాలని ప్రముఖ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత కూడా అనిల్ రావిపూడి లైనప్ బిజీగానే ఉన్నట్లు సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఓ యానిమేషన్ చిత్రానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అనంతరం దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా చేయనున్నట్లు, ఆ తర్వాత సాహు గారపాటి, సతీష్ కిలారు సంయుక్తంగా నిర్మించనున్న ప్రాజెక్ట్‌కు కూడా దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్‌ను కొనసాగిస్తూనే మరో మూడు ప్రాజెక్ట్‌లను లైనప్‌లో పెట్టిన అనిల్ రావిపూడి ఫుల్ బిజీగా ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.





