మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సోషియో – ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ పై మరోసారి ఆసక్తికర అప్‌డేట్ వెలువడింది. ఈ సినిమా చాలా కాలం క్రితమే ప్రారంభమై, మొదట 2025 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
అయితే వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా ఈ చిత్రం పదేపదే వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో పలు రిలీజ్ డేట్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, అధికారికంగా సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానుల్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే ఆసక్తి పెరిగింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ చివరి దశలో ఉండటంతో, ఈసారి రిలీజ్ విషయంలో ఆలస్యం ఉండదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, దర్శకుడు మల్లిడి వశిష్ట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
మొత్తానికి, ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ‘విశ్వంభర’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.





