HomeMovie News Telugu'మహర్షి'ని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి!

‘మహర్షి’ని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి!

మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’ సినిమా సక్సెస్‌ దిశగా పరుగులు తీస్తోంది. టాక్‌తో సంబంధం లేకుండా సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘మహర్షి’ టీమ్‌ని ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు. గ్రామీణ నేపథ్యంలో వ్యవసాయ పరిరక్షణ, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన అవశ్యకతను తెలియచెబుతూ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రతీ ఒక్కరూ చూడదగ్గ చిత్రమని ఆయన ట్వీట్‌ చేశారు.

ఫ్యామిలీతో కలిసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘మహర్షి‘ సినిమా తిలకించారు. ఆయన ప్రశంసలను టీమ్‌ మొత్తం స్వీకరిస్తున్నామని, ఈ రెస్పాన్స్‌ తమకెంతో ఉత్సాహాన్ని అందించిందనీ, ఇలాంటి మరెన్నో సినిమాలు తీసేందుకు ఇలాంటి ప్రశంసలు బూస్టప్‌ ఇస్తాయనీ వంశీపైడిపల్లి స్పందించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ మే 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

పూజాహెగ్దే, మహేష్‌కి జోడీగా నటించింది. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించాడు. సోషల్‌ కాజ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మెల్లమెల్లగా జనంలోకి దూసుకెళ్తోంది. బాక్సాఫీస్‌ వద్ద 100 కోట్లు కొల్లగొట్టడమే ‘మహర్షి’ టార్గెట్‌ అని ఫ్యాన్స్‌ బల్లగుద్ది చెబుతున్నారు. చూడాలి మరి మహర్షి ఆ టార్గెట్‌ని అందుకుంటుందో లేదో.

You May Like This
- Advertisment -spot_img

Most Popular