HomeMovie News Teluguతారక్ పవన్ మహేష్ ముగ్గురి మ్యాజిక్ నెంబర్ ఒకటే..

తారక్ పవన్ మహేష్ ముగ్గురి మ్యాజిక్ నెంబర్ ఒకటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో టాప్ హీరోలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి చిత్రం నుంచి ఎవరికి వారు ప్రత్యేక స్టైల్ అండ్ ఆటిట్యూడ్ తో.. లక్షలాది మంది అభిమానుల క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. పవన్ మరియు తారక్ సక్సెస్ ఫుల్ గా 25 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. తాజాగా మహేష్ కూడా మహర్షి మూవీతో ఆ జాబితాలో చేరిపోయాడు. ఇప్పుడు ఈ 25వ నెంబర్ వారి కెరియర్స్ లో మ్యాజిక్ నెంబర్ గా నిలిచింది…అదెలా అనుకుంటున్నారా?

ఎన్టీఆర్ 25వ చిత్రం సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ లో K.M.C అనే కంపెనీకి C.E.O గా తారక్ కనిపించగా.. పవన్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ లో A.B అనే కంపెనీకి C.E.O గా నటించాడు. తాజాగా మహేష్ నటించిన 25వ చిత్రం ‘మహర్షి’ లో కూడా ఒరిజిన్ అనే కంపెనీ C.E.O గా దర్శనమిస్తాడు. అంటే ముగ్గురు సూపర్ స్టార్లు వారి 25వ చిత్రాలలో సీఈఓ గా నటించడం యాదృచ్చికమే అయినా, కొంత ఆశ్చర్యంగా ఉంది.

అంతే కాదు ఈ ముగ్గురి హీరోల 7వ చిత్రాలు సింహాద్రి, ఖుషి మరియు ఒక్కడు లో భూమిక హీరోయిన్ గా నటించింది. 10వ చిత్రాలు నా అల్లుడు, అర్జున్ మరియు బాలు లో శ్రియ హీరోయిన్ గా నటించింది. ఇంతకీ మహేష్, పవన్ మరియు తారక్ అభిమానులు ఇవి గమనించారో లేదో మరి..

You May Like This
- Advertisment -spot_img

Most Popular