HomeMovie News Teluguనాగ్‌ చిరంజీవి మల్టీ స్టారర్‌ నిజమేనా?

నాగ్‌ చిరంజీవి మల్టీ స్టారర్‌ నిజమేనా?

‘సైరా’ తర్వాత చిరంజీవి, నాగార్జున కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ, చాలాకాలంగా ఈ విషయమై ఆశక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇద్దరు స్టార్‌ హీరోలు వీరిద్దరితో మల్టీ స్టారర్‌ అంటే అభిమానులకు మాస్త్‌ మజానే. 

సినిమాల సంగతి అటుంచితే, చిరంజీవి, నాగార్జున వ్యాపార పరంగా పాట్నర్స్‌ కూడా. ఇద్దరూ కలిసి బుల్లితెరపై ఛానెల్‌ని రన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇరు కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో చిరంజీవి ‘మెకానిక్‌ అల్లుడు’ చిత్రంలో నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించాడు. అది అప్పట్లో మంచి విజయం అందుకుంది. 

ఇదిలా ఉండగా, ప్రస్తుతం అన్నపూర్ణ బ్యానర్‌లో నాగార్జున, చిరంజీవితో ఓ సినిమా రూపొందించాలనే యోచనలో ఉన్నాడనే టాక్‌ ఫిల్మ్‌ నగర్‌లో బాగా చక్కర్లు కొడుతోంది. ఆ సినిమాలో నాగార్జున కూడా నటించనున్నాడనీ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నానితో మల్టీ స్టారర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ‘దేవదాస్‌’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్‌ చేశారు. 

మరోవైపు చిరంజీవి సినిమాల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశాక తన కొడుకు చరణ్‌ నిర్మాణంలోనే నటిస్తూ వస్తున్నాడు. ఒకవేళ జరుగుతున్న ప్రచారం నిజమై ‘సైరా’ తర్వాత చిరంజీవి అన్నపూర్ణా బ్యానర్‌లో సినిమా చేస్తాడేమో చూడాలి మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular