HomeMovie News Teluguరాజుగారూ.! మీరు సూపరూ.!

రాజుగారూ.! మీరు సూపరూ.!

అభిరుచి గల నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. ఈయన టేకప్‌ చేసే సినిమాల్లో ఇది చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని అస్సలు చూడరు. కంటెన్ట్‌ నచ్చితే చాలు వెంటనే నిర్మాణానికి ఓకే చేసేస్తారు. అలా కాబట్టే, దిల్‌ రాజు బ్యానర్‌లో వచ్చే సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఖచ్చితంగా హిట్‌ అవుతాయనే నమ్మకం కూడా ఉంటుంది.  

గతేడాది వరుస ఐదు చిత్రాలను తన బ్యానర్‌లో రూపొందించిన దిల్‌ రాజు, ఈ ఏడాది ఆల్రెడీ ఓ బిగ్‌ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. అదే వెంకీ – వరుణ్‌తేజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఎఫ్‌ 2 ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అనిల్‌ ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో దూకుడు మీదున్నాడు. ఆయన దూకుడుకి దిల్‌రాజు హ్యాండ్‌ తోడైతే ఇంకేముంది సూపర్‌ హిట్టే. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 

కాగా రాజ్‌తరుణ్‌తో దిల్‌రాజు నిర్మిస్తున్న ‘లవర్‌’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు తాజాగా మన రాజుగారు మరో మల్టీ స్టారర్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు. మల్టీ స్టారర్‌ అంటే ఈసారి మామూలుగా ఉండదట. డిఫరెంట్‌ జోనర్‌లో తెరకెక్కబోయే మల్టీ స్టారర్‌ అట ఇది. ఇంతకీ ఈ మల్టీ స్టారర్‌ని తెరకెక్కించే డైరెక్టర్‌ ఎవరో తెలుసా? విభిన్న కథా, కథనాల డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహన్‌కృష్ణ. 

ఈయన దర్శకత్వంలో ఇంతవరకూ వచ్చిన ప్రతీ సినిమా ఆడియన్స్‌కి డిఫరెంట్‌ కిక్‌ ఇచ్చింది. అలాగే ఈ సారి ఓ సరికొత్త మల్టీ స్టారర్‌కి స్క్రిప్టు ప్రిపేర్‌ చేశారట. ఆ స్క్రిప్టు దిల్‌రాజుకు నచ్చడంతో వెంటనే ఓకే చేశారట. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందనీ తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటీనటుల వివరాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. త్వరలోనే వెల్లడి చేయనున్నారట.

You May Like This
- Advertisment -spot_img

Most Popular