HomeMovie News Telugu100 రోజుల 'రంగస్థలం' ఎందుకు ప్రత్యేకం.!

100 రోజుల ‘రంగస్థలం’ ఎందుకు ప్రత్యేకం.!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ చిత్రం 100 రోజుల ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు చిత్ర యూనిట్‌. అనసూయ, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ స్టేజ్‌పై బోలెడంత సందడి చేశారు. హీరోయిన్‌ సమంత ఈ ఈవెంట్‌కి హాజరు కాలేదు. మిగిలిన చిత్ర యూనిట్‌ అంతా హాజరయ్యారు. 

గతంలో ఇలాంటి 100 రోజుల ఫంక్షన్స్‌ తరచూ జరిగేవి. కానీ ఎన్నాళ్లకెన్నాళ్లకో టాలీవుడ్‌కి దక్కిన అదృష్టం ఇది. తన కెరీర్‌లో ఇలాంటి సినిమా మళ్లీ చేయలేనేమో అన్నాడు చరణ్‌. ఒకవేళ చరణ్‌ ఈ కథకు నో అంటే చరణ్‌ కోసం మరో కథ చెప్పేవాడిని. కానీ చెప్పిన వెంటనే చరణ్‌ ఓకే చేశాడు.. అని డైరెక్టర్‌ సుకుమార్‌ అన్నారు. 

సినిమా సక్సెస్‌ అయ్యేందుకు కారణమైన ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా స్టేజ్‌పైకి ఆహ్వానించారు. ఇది ఇంతవరకూ ఏ చిత్రానికి జరగలేదు. సినిమా నిర్మాణానికి ముఖ్య భూమిక పోషించిన వారికే ఆ అదృష్టం దక్కుతుంది ఎప్పుడూ. కానీ ‘రంగస్థలం’ ఓ ప్రత్యేకమైన చిత్రం. అందుకే ఈ సినిమాకి సంబంధించినంత వరకూ తెరపై కనిపించిన ప్రతీ పాత్ర ప్రత్యేకం. అలాగే ఆ పాత్ర అంత అందంగా కనిపించడానికి కారణమైన తెర వెనుక ప్రతీ వ్యక్తీ ప్రత్యేకమే. అందుకే సినిమా ఇంత సక్సెస్‌ కావడానికి కారణమైన ప్రతీ ఒక్కరూ, ప్రతీ ఒక్కరూ స్టేజ్‌పై సందడి చేశారు. 

మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ‘రంగస్థలం’. హీరోగా చరణ్‌కే కాదు, టాలీవుడ్‌కే ప్రత్యేకమైన చిత్రం ‘రంగస్థలం’. నాన్‌ బాహుబలి రికార్డులన్నింటినీ కొల్లగొట్టిన అసలు సిసలు తెలుగు చిత్రం ‘రంగస్థలం’. అందుకే 100 రోజుల ‘రంగస్థలం’ అంత ప్రత్యేకం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular