HomeMovie News Teluguపవన్‌ కళ్యాణ్‌ 1 2 3..!

పవన్‌ కళ్యాణ్‌ 1 2 3..!

సినీ రంగంలో ఉన్నన్నాళ్లూ మెగాస్టార్‌ చిరంజీవికి ఎదురే లేదు. ఆయనే మెగాస్టార్‌. కానీ రాజకీయాల్లోకి వెళ్లాక చిరంజీవి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నాలు చేశారు చాలా మంది. లేని మచ్చల్ని వెతికేందుకు నానా పాట్లు పడ్డారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ చుట్టూ జరిగిన రాజకీయ రచ్చ అందరికీ తెలిసిందే. 

ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ వంతు వచ్చింది. సోషల్‌ మీడియాలో హేటర్స్‌ పవన్‌ వ్యక్తిగత జీవితంలో చెలరేగిపోతున్నారు. విశాఖపట్టణానికి చెందిన నందినితో పవన్‌కి మొదటి వివాహం జరిగింది. ఆ తర్వాత రేణూదేశాయ్‌తో వివాహం అయ్యింది. ప్రస్తుతం పవన్‌ సతీమణిగా అన్నాలెజినోవా కనిపిస్తున్నారు. నందినితో పెళ్లి అయితే అయ్యింది కానీ, కొద్ది రోజులకే ఇద్దరూ విడిపోయారు. చాలా కాలం తర్వాత రేణూదేశాయ్‌ పవన్‌ జీవితంలోకి వచ్చింది. కొన్నాళ్ల సహజీవనం తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పవన్‌ – రేణూ విడాకుల తర్వాత అన్నా లెజినోవా పవన్‌ జీవితంలోకి వచ్చింది. 

ఇవి అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు కొత్తగా దీన్ని వివాదం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఇలాంటి వివాదాలు, విమర్శలు తప్పవు. సమాధానం చెప్పను అని తప్పించుకుంటే కుదరదు ఏదో ఒక సమాధానం చెప్పి తీరాల్సందే. అందరూ ఆ సమాధానాన్ని ఏకీభవించాలనీ లేదు. 

ఏదేమైనా పవన్‌ కళ్యాణ్‌ 1,2,3 అంటూ ఆయన పెళ్లిళ్లపై జరుగుతున్న రచ్చ ‘జనసేన’ పార్టీపై ఏదో ఒక రకంగా ప్రభావం చూపించక మానదు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular