HomeMovie News Teluguఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- రంగస్థలం

ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- రంగస్థలం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలంతో స్టార్ హీరోతో పాటు ఒక మంచి నటుడిగా కూడా తన పేరుని సుస్థిరం చేసేసుకున్నాడు. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చిన తరుణంలో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఇక ఈ చిత్ర కథ 80వ దశకంలో సృష్టించిన దర్శకుడు, అప్పటి పరిస్థితులు, అలవాట్లు, ప్రజల మధ్య ఉండే సంబంధాలని చాలా అద్బుతంగా ఆవిష్కరించాడు. ఇక ఇందులో పాత్రలు కూడా నిజజీవితంలో మనం చూసే వ్యక్తులని పోలి ఉండడం మనల్ని ఈ కథలో మరింతలా లీనమయ్యేలా చేస్తుంది.కథానాయకుడు పాత్రలో చిట్టి బాబు అలియాస్ రామ్ చరణ్ తనలోని నటనని పరిపూర్ణంగా బయటకి తీసి అందరికి చూపించగలిగాడు. 

ఇదే సమయంలో చెవిటివాడిగా చరణ్ చేసిన అభినయం ప్రేక్షకుల చేత నవ్వులే గాక కన్నీళ్ళు సైతం పెట్టిస్తుంది. మెగాస్టార్ వారసుడిగా ఈ చిత్రంతో రామ్ చరణ్ నూటికి నూరుశాతం నిరూపించుకున్నాడు.

మొత్తానికి మెగా అభిమానులందరూ తమ అభిమాన హీరో నుండి కోరుకునే చిత్రాన్నిరామ్ చరణ్ ఈ రంగస్థలం ద్వారా వారికి అందించాడు. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని రికార్డులు కొల్లగోట్టనుంది అన్న విషయం త్వరలోనే తేలిపోనుంది.

ఇది ఈ వారం ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్.

You May Like This
- Advertisment -spot_img

Most Popular