HomeMovie News Teluguమహేష్‌ - కైరా జోడీ అదిరిందిగా.!

మహేష్‌ – కైరా జోడీ అదిరిందిగా.!

బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ తొలిసారిగా తెలుగులో నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. ఇంతవరకూ హీరో మహేష్‌బాబుకి సంబంధించిన పలు పోస్టర్స్‌ రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. కానీ ఇంతవరకూ హీరోయిన్‌ పోస్టర్‌ ఒక్కటీ రాలేదు. అందుకే ఆ లోటు తీర్చేలా ఉంది ఈ తాజా పోస్టర్‌. కైరా అద్వానీ, మహేష్‌బాబు జంటగా నడుచుకుని వస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్‌ని కైరా అద్వానీ తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. 

‘మహేష్‌తో ఇది నా తొలి పోస్టర్‌ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ కూడా జత చేసింది. ఈ లుక్‌కి మహేష్‌ ఫ్యాన్స్‌ నుండి వస్తున్న రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు. లైకుల మీద లైకులూ, షేర్స్‌ మీద షేర్లు చేస్తూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఏమాటకామాటే చెప్పాలి ఈ లుక్‌ సూపర్బ్‌గా ఉందిలే. కైరాతో మహేష్‌ జోడీ కొత్తగా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. స్కై బ్లూ కలర్‌ శారీలో హుందాగా, ఆహ్లాదంగా అనిపిస్తోంది కైరా అద్వానీ. 

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఏప్రిల్‌ 1న సెకండ్‌ ఆడియో సింగిల్‌ రిలీజ్‌ కానుందనీ ఈ సినిమాకు మ్యూజిక్‌ అందించిన రాకింగ్‌ మ్యూజిక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ తాజాగా ప్రకటించారు. 

పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular