HomeMovie News Teluguమెగాపవర్‌ స్టార్‌ నుండి మరో గుడ్‌ న్యూస్‌.!

మెగాపవర్‌ స్టార్‌ నుండి మరో గుడ్‌ న్యూస్‌.!

రామ్‌ చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ సూపర్‌ హిట్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. లేట్‌గా వచ్చినా, లేటెస్టుగా హిట్‌ కొట్టాడు చరణ్‌. ఈ ఏడాదికి బాక్సాఫీస్‌కి మంచి బోనీ కొట్టేశాడు ‘రంగస్థలం’ సినిమాతో. ఈ టైంలో చరణ్‌ నుండి మరో గుడ్‌ న్యూస్‌ వినిపిస్తోంది. బోయపాటితో చరణ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆల్రెడీ చరణ్‌ తన లుక్‌, బాడీ లాంగ్వేజ్‌ని పూర్తిగా మార్చేశాడు కూడా. 

అయితే బోయపాటితో చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్‌ కంప్లీట్‌ చేసే యోచనలో ఉన్నాడట చరణ్‌. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసేసి, నెక్స్ట్‌ రాజమౌళి సినిమాతో బిజీ కానున్నాడట. ఎలాగూ బోయపాటి సినిమాలు తొందరగా నిర్మాణం పూర్తి చేసుకుంటాయి. చరణ్‌ కో ఆపరేట్‌ చేస్తే ఆ పని మరింత స్పీడుగా పూర్తవుతుంది. ‘రంగస్థలం’ సక్సెస్‌ ఇచ్చిన జోష్‌తో చరణ్‌ మరింత స్పీడుగా సినిమాలు చేయాలనుకుంటున్నాడట. అలా దసరాకి బోయపాటి సినిమా కంప్లీట్‌ అయిపోద్ది అనుకుంటున్నారు. 

అదే నిజమైతే, 2017లో చరణ్‌ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ లోటు ఈ సంవత్సరం రెండు సినిమాలతో తీర్చేసినట్లవుతుంది. ఇది నిజంగా మెగా అభిమానులకు పండగలాంటి వార్తే కదా. ఇక ఈ ఏడాదిలోనే రాజమౌళి మల్టీ స్టారర్‌ కూడా పట్టాలెక్కేసే అవకాశాలున్నాయి. ఈ సినిమా కోసం మరో పక్క ఎన్టీఆర్‌ కూడా తనను తాను సంసిద్ధం చేసుకుంటున్నాడు. చరణ్‌తో పాటు, ఎన్టీఆర్‌ కూడా దూకుడు మీదే ఉన్నాడు. 

ఓ పక్క త్రివిక్రమ్‌ సినిమా కోసం ప్రిపేర్‌ అవుతూనే, మరో పక్క చరణ్‌తో మల్టీస్టారర్‌ కోసం కూడా ఎన్టీఆర్‌ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. అదీ సంగతి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular