HomeMovie News Telugu'ఎన్టీఆర్‌' మూవీలో చైతూ, మహేష్‌.!

‘ఎన్టీఆర్‌’ మూవీలో చైతూ, మహేష్‌.!

ఎన్టీఆర్‌ ఏఎన్నార్‌, కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు మూల స్థంభాలుగా చెబుతారు. తాజాగా బాలయ్య ప్రధాన పాత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ బయోపిక్‌ అంటే అందులో ఖచ్చితంగా అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు ఎక్కువ స్కోప్‌ ఉంటుంది. అదే సమయంలో కృష్ణ పాత్రకూ స్కోప్‌ ఉండొచ్చు. 

అందుకే ఈ బయోపిక్‌లొ కృష్ణ పాత్ర కోసం మహేష్‌బాబును బాలయ్య రిక్వెస్ట్‌ చేశాడట. నటించేందుకు మహేష్‌ కూడా ఒప్పుకున్నాడనీ సమాచారమ్‌. అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కోసం ఆల్రెడీ ఆయన మనవడు నాగచైతన్యని సంప్రదించారనీ తెలుస్తోంది. సోషల్‌ మీడియా హాట్‌ బాంబ్‌ శ్రీ రెడ్డి, ‘ఎన్టీఆర్‌’ సినిమాలో మహేష్‌బాబు నటిస్తున్నాడన్న విషయాన్ని తాజాగా కన్‌ఫామ్‌ చేసింది. దాంతో ఈ బయోపిక్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఎన్టీఆర్‌ బయోపిక్‌ అంటే ఆషామాషీ కాదు. ఈ సినిమాలో ఇంకా చాలా మంది ప్రముఖుల పాత్రలు యాడ్‌ అయ్యే అవకాశాలున్నాయి. 

ఆ ప్రముఖుల పాత్రల్లో ఎవరెవరు నటిస్తారన్న విషయంపై సర్వత్రా ఆశక్తి నెలకొంది. బాలయ్య సొంత బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్‌ ఈ బయోపిక్‌లో నటిస్తున్నాడనీ ధృవీకరించిన శ్రీరెడ్డికి కూడా తేజ – బాలయ్య ఈ సినిమాలో ఏదో పాత్ర ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలా ఈ బయోపిక్‌ తుది దశకు చేరుకునే సరికి ఎంతమంది జాయిన్‌ అవుతారో చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular