HomeMovie News Teluguసెంచరీ కొట్టేసిన 'రంగస్థలం'

సెంచరీ కొట్టేసిన ‘రంగస్థలం’

100 కోట్ల క్లబ్‌లోకి ‘రంగస్థలం’ చేరిపోయింది. వరల్డ్‌ వైడ్‌గా గ్రాస్‌ 100 కోట్లను దాటేసిందనీ అంచనా వేస్తున్నారు. ఇది కేవలం అంచనా మాత్రమే కాదు, రికార్డుల్లోకెక్కింది ‘రంగస్థలం’. ఇంతవరకూ ఈ తరహా రికార్డులు ‘బాహుబలి’ సినిమాకే సొంతం. ‘బాహుబలి’ తర్వాత ఆ రికార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా ‘రంగస్థలం’ అంటున్నారు. 

‘బాహుబలి’ సినిమా తర్వాత అంత వేగంగా ‘రంగస్థలం’ ఈ గ్రాస్‌ను అందుకుంది. వసూళ్ల ప్రభంజనం ఓ ఎత్తయితే, చరణ్‌ యాక్టింగ్‌ మరో ఎత్తు ఈ సినిమాకి. ఒక్క చరణ్‌ పాత్రే కాదు, ఈ సినిమాలోని ప్రతీ పాత్రకీ అంతే పేరు దక్కుతోంది. ‘రంగస్థలం’ సినిమా గురించి అందుకే అందరూ కథలు కథలుగా మాట్లాడుకుంటున్నారు. పెళ్లి తర్వాత సమంత చేసిన ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌ సినిమా ఇది. పెళ్లి తర్వాత హీరోయిన్స్‌ ఫేడ్‌ అయిపోతారని అంటుంటారు. కానీ సమంత అందుకు భిన్నం. పెళ్లి తర్వాత వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టి, మిగతా హీరోయిన్స్‌కి ధీటుగా నిలబడింది. స్టార్‌ హీరోయిన్‌ ఛైర్‌ని ఎప్పుడో సమంత ఆక్యుపై చేసేసింది. 

ఇప్పుడు ‘రంగస్థలం’ సినిమాతో ఇంకేముంది, స్టార్స్‌కే స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకుంది తన పర్‌ఫామెన్స్‌తో సమంత. ‘రంగస్థలం’కి సంబంధించి ఇదో ప్రత్యేక అంశం. చరణ్‌ – సమంత తొలిసారి జత కట్టిన జోడీ ఈ స్థాయిలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవ్వడం పట్ల ఇటు చరణ్‌ అభిమానులూ, అటు సమంత అభిమానులూ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular