HomeMovie News Teluguవిజయ్‌ను కలిసిన సమంత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

విజయ్‌ను కలిసిన సమంత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సమంత తన నిర్మాణ సంస్థ ట్రాలాలా పిక్చర్స్‌పై నిర్మిస్తున్నారు. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆమె వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా చెన్నై పర్యటనకు వెళ్లిన సమంత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు.

సమంత తన పోస్ట్‌లో.. చెన్నైలో అడుగుపెట్టిన క్షణం నుంచి ప్రత్యేకమైన అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. విజయ్‌ను కలవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. విజయ్ కేవలం సినీ హీరో మాత్రమే కాదని.. సమాజం కోసం పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగుతున్న వ్యక్తి అని సమంత అభిప్రాయపడ్డారు. సినీ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న తర్వాత కూడా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావడం గొప్ప నిర్ణయమని ప్రశంసించారు.

ప్రజల కోసం పనిచేయాలనే సంకల్పం.. సమాజంపై బాధ్యత ఉన్నవారే ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలరని ఆమె పేర్కొన్నారు. విజయ్ తనను నమ్మిన ప్రజల అంచనాలను తప్పకుండా నిలబెడతారనే నమ్మకం కూడా వ్యక్తం చేశారు. అలాగే సమాజంలో మార్పు తీసుకురావాలనుకునే ప్రతి యువకుడికి విజయ్ ప్రయాణం స్ఫూర్తిదాయకమని సమంత తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular