HomeMovie News Telugu'ఆమె' మరణం ఎప్పటికీ రహస్యమే!

‘ఆమె’ మరణం ఎప్పటికీ రహస్యమే!

సినీ రంగంలో డైనమిక్‌ లేడీస్‌గా పేరు తెచ్చుకున్న చాలా మంది ముద్దుగుమ్మలు పలు కారణాలతో వివిధ సందర్భాల్లో తమ తమ ప్రాణాలను వదిలేశారు. గ్లామర్‌ లోకంలో అందాల తారలుగా ఎంత ఉన్నతమైన పేరు తెచ్చుకున్నా, వారూ వారి నిజ జీవితం విషయానికి వచ్చేసరికి సామాన్యమైన మనుషులే. వాళ్లకీ భావోద్వేగాలుంటాయి. అయితే అందరిలా బయటికి చెప్పుకోలేరంతే. 

తారలుగా పేరు తెచ్చుకుని, అనుమానాస్పద మరణానికి గురైనవారు చాలా మందే ఉన్నారు సినీ ప్రపంచంలో. దురదృష్టం ఏంటంటే ఈ కారణంతో వారు చనిపోయారు లేదా చంపేశారు అనే నిజాలు ఎప్పటికీ వెలుగు చూడవు. అతిలోక సుందిరి శ్రీదేవి మరణం ఇప్పుడు మిస్టరీగా మారి పలు అనుమానాలకు తావిస్తోంది. శ్రీదేవే కాదు, గతంలో ఇలా పలు కారణాలతో మరణించినవారి మరణ మిస్టరీలు ఇంతవరకూ వెలుగు చూడకపోవడం దురదృష్టకరం. 

బాలీవుడ్‌ బ్యూటీ జియాఖాన్‌ అనుమానాస్పద స్థితిలోనే మరణించింది. ఆమెను తన లవరే చంపేశాడనీ, చచ్చేంతలా ఆమెపై మానసిక ఒత్తిడి తీసుకొచ్చాడనీ రకరకాల అనుమానాలున్నాయి. అయితే అందులోని నిజాలేంటనేది ఇంతవరకూ తెలీదు. అలనాటి అందాల ముద్దుగుమ్మ దివ్యభారతి మరణం కూడా అంతే. బిల్డింగ్‌ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే అందుకు గల కారణాలు మిస్టరీనే. మహానటి సావిత్రి తీవ్ర అనారోగ్యంతో మరణించింది. కానీ ఆమె అనారోగ్యానికి కుటుంబ సభ్యుల నుండి వచ్చి తీవ్రమైన ఒత్తిడులే కారణమంటూంటారు. కానీ అసలు నిజాలు తేలనే లేదు. 

ఐటెం గాళ్‌ సిల్క్‌స్మిత మరణం కూడా అనుమానాస్పదమే. ఇలా ఒక్కరేమిటి. సినీ రంగంలో పలువురి మరణాలు అనుమానాస్పదం స్థితిలోనే జరిగాయి. ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాగే శ్రీదేవి మరణం కూడా మిస్టరీగా మిగిలిపోనుందో, ఏమో తేలితే కానీ తెలీదు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular